Monday, 2 November 2026

May 2013

తెలంగాణ

ఐసెట్‌ ఫలితాలు విడుదల

వరంగల్‌ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్‌`2013 ఫలితాలు విడుదలయ్యాయి. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉపకులపతి, ఐసెట్‌ ఛైర్మన్‌ బి. వెంకటరత్నం ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ

సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు: కేటీఆర్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ డెడ్‌లైన్లకు లొంగదని ముఖ్యమంత్రి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణవాదుల అత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఎం మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. డెడ్‌లైన్లు పెట్టి మాట…

జాతీయం

నేడు మరోసారి ఆజాద్‌తో భేటీ కానున్న సీఎం

న్యూఢల్లీి : దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు మరోసారి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి గులాంనబీ అజాద్‌తో భేటీ కానున్నారు. నిన్న అజాద్‌తో గంటపాటు ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్ర వ్యవహారాలపై చర్చించారు. మంత్రివర్గంలో మార్పులుచేర్పులపై…

సీమాంధ్ర

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముబంయి : జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 160 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

తెలంగాణ

పిలెటన్‌`7ను వాయుసేనకు అప్పగించిన రక్షణ శాఖ

హైదరాబాద్‌ : అత్యాధునిక యుద్ధ శిక్షణ విమానం పిలెటస్‌ `7ను వాయుసేనకు రక్షణ శాఖ అప్పగించింది. దుండిగల్‌లోని వాయుసేన అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10 విమానాలను వాయుసేనకు రక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ అప్పగించారు.

జాతీయం

30కిలోల పేలుడు పదార్థాలను వాడిన మావోయిస్టులు

`ఫొరెన్సిక్‌ నివేదికలో వెల్లడి రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ మారణకాండపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ నేతలపై దాడిలో 27 నుంచి 30 కిలోల పేలుడు పదార్థాలను మావోయిస్టులు వాడినట్లు ఫొరెన్సిక్‌ నివేదికలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ

పాఠశాల బస్సు, లారీ ఢీ.. ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌ : మక్తల్‌ మండలం బొందల్‌కుంట స్టేజీ సమీపంలో ఈ ఉదయం పాఠశాల బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పాఠశాల బస్సులోని ఓ విద్యార్థి, లారీ డ్రైవర్‌ మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప…

జాతీయం

నేటి నుంచి మహారాష్ట్రలో రాష్ట్రపతి పర్యటన

న్యూఢల్లీి : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నేడు, రేపు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ముంబయి, పుణెలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. షిరిడీ సాయిబాబాను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.

తెలంగాణ

కేటీపీఎస్‌ ఆరో యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం జిల్లా : కేటీపీఎస్‌ ఆరో యూనిట్లో ఈ ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు కేటీపీఎస్‌ అధికారులు తెలిపారు.

తెలంగాణ

లారీ, ఆటో ఢీ: ఇద్దరి మృతి

రంగంపేట : తూర్పుగోదావరి జిల్లా రంగంపేట వద్ద ఏడీబీ రోడ్డులో ఈ ఉదయం లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.