Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన టీటీడీపీ నేతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు కలిశారు. బయ్యారం గనులను విశాఖకు కేటాయింపు ఉత్తర్వులు రద్దు చేసేలా చొరవ తీసుకోవాలని గవర్నర్‌కు వారు వినతి పత్రం సమర్పించారు.

తెలంగాణ

గల్ఫ్‌లో చిక్కుకున్న వారికి కేసీఆర్‌ సాయం

హైదరాబాద్‌, గల్ఫ్‌లో చిక్కుకున్న వారికి టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్థిక సాయం చేశారు. అక్కడ చిక్కుకున్న ఆరుగురి విడుదలకు ఓ సంస్థకు కేసీఆర్‌ రూ. 15 లక్షల చెక్కును అందజేశారు.

తెలంగాణ

సీఎం కిరణ్‌కు చంద్రబాబు లేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. ఆర్ధిక నేరాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని బాబు లేఖలో కోరారు. సూక్ష్మరుణ, ఆర్థిక లావాదేవీలు…

తెలంగాణ

ఐపీఎల్‌ను నిషేధించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ

హైదరాబాద్‌ : బెట్టింగ్‌ , ఫిక్సింగ్‌ వూబిలో చిక్కుకున్న ఐపీఎల్‌ను తక్షణమే నిషేధించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. దేశభక్తిని పెంపొందించాల్సిన క్రీడలు వ్యాపార లాభాల కోసం దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా, కాంగ్రెస్‌లకు…

హైదరాబాద్

చిరంజీవి సీఎం అభ్యర్థి అయితే తప్పేంటీ?

హైదరాబాద్‌, తనను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని దేవాదాయా శాఖ మంత్రి సి. రామచంద్రయ్య తెలిపారు. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే తప్పేంటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి…

తెలంగాణ

అనకాపల్లి ఇంచార్జి నియామకానికి కోర్‌ కమిటీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జి నియామకానికి చంద్రబాబు 10 మంది సభులతో కోర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇంఛార్జిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని నియమించారు.

జాతీయం

రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్‌ అమిత్‌ సింగ్‌ సస్పెండ్‌

ముంబయి: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ అంశంలో రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్‌ అమిత్‌ సింగ్‌ను బీసీసీఐ సస్పెండ్‌ చేసింది. ఫిక్సింగ్‌ వ్యవహారంలో క్రికెట్‌ బుకీగా వ్యవహరించాడనే ఆరోపణలు రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ

క్రీడారంగాన్ని తాకట్టు పెట్టొద్దు

హైదరాబాద్‌, జనంసాక్షి: పవిత్రమైన క్రీడారంగాన్ని తాకట్టు పెట్టొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఐపీఎల్‌ లీగ్‌ను రద్దు చేసి క్రికెట్‌లో పాత వ్యవస్థనే ఉంచాలని ఆయన శుక్రవారమిక్కడ అభిప్రాయపడ్డారు. ఎన్నికలు సమీపించినప్పుడే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని నారాయణ…

వార్తలు

జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలి

యానాం: పుదుచ్చేరి ప్రభుత్వం యానాం నియోజకవర్గం అభివృద్దికి కేటాయించే నిధుల విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తుందని, ఇవ్వాల్సిన నిధుల కంటే తక్కువ నిధులు మంజూరు చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ఆరోపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం యానాం…