Thursday, 5 November 2026

May 2013

జాతీయం

ఆజాద్‌తో ముగిసిన ముఖ్యమంత్రి సమావేశం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కళంకిత మంత్రులు, పార్టీ వ్యవహారాలపై చర్చించారు.

జాతీయం

ఆజాద్‌తో సమావేశం కానున్న సీఎం కిరణ్‌ కుమార్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛర్జీ గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల అంశంతో పాటు, పలు పార్టీ సంబంధిత అంశాలపై కూడా ఆజాద్‌తో కూడా సీఎం చర్చించనున్నట్లు సమాచారం.

జాతీయం

120 కిలోల గంజాయి స్వాధీనం

విశాఖ: రోలుగుంట మండలం నందివంపు వద్ద రూ. 12లక్షల విలువైన 120  కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

తెలంగాణ

హన్మకొండలో కేసీఆర్‌

వరంగల్‌: హన్మకొండలో తెరాస అధినేత కేసీఆర్‌ ద్విచక్రవాహన ర్యాలీని ప్రారంభించారు. అలాగే నగర పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు.

తెలంగాణ

ప్రధాని దేశానికే భారంగా మారారు

హైదరాబాద్‌: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పైభాజపా నేత వెంకయ్యనాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్‌సింగ్‌ దేశానికే భారంగా మారారని దుయ్యబట్టారు. ముస్లిం యువకుల కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్న కేంద్ర హోంమంత్రి షిండే వ్యాఖ్యలు ప్రజల్లో అపార్ధాలకు…

సీమాంధ్ర

ఏయూ ఇంజనీరింగ్‌ ప్రశ్నాపత్రం లీక్‌

విశాఖ, జనంసాక్షి: ఆంధ్ర యూనివర్శిటీలో ప్రశ్నా పత్రాల లీకేజీ భాగోతం బయటపడింది. ఇంజనీరింగ్‌ ప్రశ్నాపత్రాలు ఒకరోజు ముందుగానే ఈ- మెయిల్‌ ద్వారా విద్యార్థులకు చేరుతున్నాయి. ఒక్కో ప్రశ్నా పత్రాన్ని పదివేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం, ఏలూరులో ఇంజనీరింగ్‌ ప్రశ్నాపత్రం లీకైనట్లు…

జాతీయం

సోనియాతో కేకే భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కె.కేశవరావు భేటీ అయ్యారు. భేటీ అనంతరం కేకే మాట్లాడుతూ దాదాపు సంవత్సరం తరువాత సోనియాను కలిసినట్లు చెప్పారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పై సోనియా ఆరా తీశారని తెలిపారు.

జాతీయం

కాసేపట్లో ఆజాద్‌తో బొత్స భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ వ్యవహారాల పరిశీలకుడు గులాంనబీ ఆజాద్‌తో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాసేపట్లో భేటీ కానున్నారు. పార్టీ అంశాలపై అధిష్ఠానం పెద్దలతో చర్చించేందుకు బొత్స ఈరోజు ఉదయమే ఢిల్లీ చేరుకున్నారు.

సీమాంధ్ర

సర్పవరం సీఐ సస్పెన్సన్‌

సర్పవరం: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తూర్పుగోదావరి జిల్లా సర్పవరం సీఐ అప్పారావుపై సస్పెన్షన్‌ వేటు పడింది. భాగ్యనగర్‌ పైపులైన్‌ క్రాంటాక్టర్‌ , సబ్‌ కాంట్రాక్టర్‌ మధ్య వివాదంలో అప్పారావు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ

సచివాలయ ముట్టడికి టీఎస్‌ఎస్‌ఎఫ్‌ యత్నం

హైదరాబాద్‌: అవినీతి మంత్రులను మంత్రివర్గం తొలగించాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌ తరలించారు.