Thursday, 5 November 2026

June 2013

సీమాంధ్ర

గుంటూరు జిల్లావాసులు ఏడుగురి గల్లంతు

గుంటూరు జిల్లా : చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన వారు ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. దుగ్గిరాలకు చెందిన మల్లేశ్వరి, మున్నంగికి చెందిన కుమారి, అమరావతికి చెందిన దంపతులతో సహా ఏడుగురు గల్లంతైనట్లు తెలిసింది.

తెలంగాణ

అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర శాసనసభ రేపటికి వాయిదా పడింది. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ

ప్రజాసమస్యలపై చర్చను ప్రభుత్వం వాయిదా వేస్తోంది: తెదేపా

హైదరాబాద్‌ : ప్రభుత్వ ఛీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి, వివ్‌ అనిల్‌, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డిలు అసెంబ్లీ లాబీలోని టీడీఎల్పీ కార్యాలయంలో తెలుగుదేశం శాసనసభాపక్ష నేతలతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు తాము పట్టుబడుతుంటే ప్రభుత్వం మాత్రం…

జాతీయం

ఉత్తరాఖండ్‌ బాధితులకు డీఎస్‌ పరామర్శ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో వరదల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులను ఇక్కడి ఏపీ భవన్‌లో పీసీసీ మాజీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ పరామర్శించారు. వరద బాధితులను ప్రభుత్వం ఇక్కడి ఏపీ భవన్‌కు చేర్చిన అనంతరం వారిని డీఎస్‌ కలుపుకున్నారు.…

తెలంగాణ

సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి: కూనంనేని

హైదరాబాద్‌ : స్వాతంత్య్ర దినోత్సవం రోజున సత్‌ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రిని కోరారు. మిగిలినవారికి కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష మినహాయింపు ఇవ్వాలని సూచించారు. తన విజ్ఞప్తికి…

తెలంగాణ

ఆమెవన్నీ అసత్య ఆరోపణలే: శంకర్‌రావు

హైదరాబాద్‌ : తన కోడలంటూ ఓ మహిళ తనపై చేసిన ఆరోపణలను మాజీ మంత్రి శంకర్‌రావు ఖండించారు. మూడేళ్ల క్రితమే ఓ డ్రైవర్‌తో వెళ్లిపోయిన అమె తనపై అసత్వ అరోపణలు చేస్తోందని శంకర్‌రావు మండిపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై…

జాతీయం

60 రూపాయలకు చేరిన డాలర్‌ ధర

ముంబై,(జనంసాక్షి): రూపాయి పతనం ఆగడం లేదు. 11 నెలల తర్వాత మళ్లీ 59.61 పైసలకు రూపాయి పతనం అయ్యి జీవిత కాలపు కనిష్ట స్థాయికి చేరింది. 2012 జూన్‌28న 57 ను తాకిన తరువాత మళ్లీ ఈ నెల…

తెలంగాణ

రేపు విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌ : రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వారీ బంద్‌కు పిలుపునిచ్చారు.

సీమాంధ్ర

తిరుపతిలో బ్యాంకు ఉద్యోగుల ఘరానా మోసం

తిరుపతి: స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెస్‌కోర్‌లో ఉద్యోగులు భారీ మోసానికి పాల్పడ్డారు. బంగారం లేకుండానే ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు రూ. 70 లక్షలు రుణం తీసుకున్నారు. బ్యాంకులో నాలుగు రోజుల్లో రూ. 23లక్షలు గల్లంతు కావడంతో అసలు విషయం వెలుగు…