Friday, 6 November 2026

June 2013

అంతర్జాతీయం

60కి చేరిన ఉత్తరాఖండ్‌ మృతుల సంఖ్య

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. గంగానది ఉధృతికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో కొట్టుకుపోయి అరవై మంది మృతి చెందినట్లు సమాచారం. నలబై మందికి పైగా గాయపడ్డారు. వందల ఇళ్లు నీటి ప్రవాహ ఉధృతికిఇ ధ్వంసమయ్యాయి.…

జాతీయం

ఆర్థిక మంత్రితో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు రఘు

ఖమ్మం : న్యూడెమోక్రసీ అజ్ఞాత నక్సల్స్‌ దళం నుంచి ఆయుధాలతో పారిపోయిన షేర్‌ మధు అలియాస్‌ రఘు వరంగల్‌ జిల్లా ఖానాపురం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. రఘు స్వస్థలం వరంగల్‌ జిల్లా కుదరావుపేట. ఈ ఘటనను పోలీస్‌…

తెలంగాణ

నేడు డైట్‌సెట్‌- 2013 ఫలితాల విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి): డైట్‌సెట్‌-2013 ఫలితాలు విడుదల కానున్నాయి. ఇవాళ ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించారు.

తెలంగాణ

తెలంగాణ కోసం దేనికైనా సిద్ధం: మంత్రి ప్రసాద్‌

హైదరాబాద్‌ : తెలంగాణ కోసం దేనికైనా సిద్ధమని మంత్రి ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. ఈరోజు మధ్యాహ్నం జరిగే తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశంపై తనకెవరూ చెప్పలేదని పేర్కొన్నారు. సమావేశానికి ఆహ్వానించకపోతే ఎలా వెళ్తానని ప్రశ్నించారు.

తెలంగాణ

నేడు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి):సాధారణ ఎన్నికల మంచుకొస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రదతినిధులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ఏదో ఒకటి తేల్చుకోలేక పోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఇవాళ భేటీ కానున్నారు.…

తెలంగాణ

ఆయుధాలతో మావోయిస్టు పరారీ

ఖమ్మం : ఇల్లెందు-గుండాల అటవీప్రాంతం నుంచి న్యూడెమోక్రసీ దళసభ్యుడు రఘు ఆయుధాలతో పరారయ్యాడు. ఏకే-47, మరో రెండు ఆయుధాల రఘు వద్ద ఉన్నట్లు సమాచారం

అంతర్జాతీయం

కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌ : హిమాచల్‌ ప్రదేశలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కిన్నౌపూర్‌లో కొండ చరియలు విరిగిపడి పది మంది మృతిచెందారు. కిన్నౌపూర్‌లో చిక్కుకున్న వారిని ఐటీబీపీ, సైన్యం సాయంతో కాపాడేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు వెల్లడించారు.

అంతర్జాతీయం

నేను లౌకిక వాదినే: నితీష్‌కుమార్‌

పాట్నా :తాను ఎప్పటికీ లౌకిక వాదినేనని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అన్నారు. తాను లౌకిక వాదినని మన్మోహస్‌సింగ్‌ వ్యాఖ్యానించడం సంతోషంగా ఉందని, ఈసందర్భంగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఏతో జేడీయూ తెగతెంపులు చేసుకోవడంలో ఎలాంటి దురుద్దేశం లేదని, దేశ…

జాతీయం

భవనం పైకప్పు కూలి పలువురికి గాయాలు

ముంబయి : ముంబయిలోని భయాంధర్‌లో భవనం పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.