Friday, 6 November 2026

June 2013

సీమాంధ్ర

వుడా పార్క్‌లో కూలిన భవనం… పది మందికి తీవ్రగాయాలు

విశాఖ: వుడా పార్క్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. అధికారులు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు.

తెలంగాణ

టీఆర్‌ఎస్‌లో కేకే కీలక బాధ్యతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయనను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జాతీయ వ్యవహారాల సెంక్రటరీ జనరల్‌గా బాధ్యతలు అప్పగించారు. రేపు ఆయన తెలంగాణ భవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.

జాతీయం

రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ముందుకు వెళ్తోంది మాకెన్‌

న్యూఢిల్లీ : రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ముందుకు వెళ్తోందని మాజీ కేంద్ర మంత్రి అజయ్‌మాకెన్‌ అన్నారు. అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. యూపీఏ ముందుకు వెళ్తుంటే… ఎస్‌డీఏ తిరోగమనంలో…

అంతర్జాతీయం

25కు చేరిన ఉత్తరాఖండ్‌ మృతుల సంఖ్య

డెహ్రడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సవం సృష్టిస్తున్నాయి. ఉత్తరాది నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి నదుల ఒడ్డున ఉన్న ఇళ్లు, హోటళ్లు నేలకొరుగుతున్నాయి. భారీ వాహనాలు సైతం వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఈ వరదల దాటికి ఇప్పటి…

తెలంగాణ

తప్పని పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశాం: గండ్ర

హైదరాబాద్‌ : తప్పని పరిస్థితుల్లోనే అసెంబ్లీ నుంచి తెరాస, భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసినట్లు ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి వెల్లడించారు. బీఏసీకి హాజరుకాకుండా సభాపతిపై తెదేపా నేతలు అపనిందలు వేయడం సబబుకాదని ఆయన అన్నారు.

తెలంగాణ

మంత్రివర్గ సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో బంగారు తల్లి పథకానికి చట్టబద్ధత, పంచాయతీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం ఉంది.

ఆదిలాబాద్

గిరిజనులపై దాడికి యత్నం

నెన్నెలా : మండలంలోని కృష్ణపల్లి గ్రామానికి చెందిన గిరిజనులపై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించగా గ్రామస్థుల సహకారంతో గిరిజనులు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇటీవల గిరిజనులకు ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసిన భూమిని పట్టాదారు అక్రమించుకొని…

తెలంగాణ

బయ్యారంపై హైకోర్టులో పిల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): బయ్యారం గనుల ప్రాస్పెక్టింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలయింది. ప్రొఫెసర్‌ జేపీ రావు ఈ పిల్‌ వేశారు. రాష్రీయ ఇస్సాత్‌ నిగం కంపెనీకి5,342 చదరపు హెక్టార్లలో ఇనుప ఖనిజం కట్టబెట్టారని,…

తెలంగాణ

తెరాస జాతీయ వ్యవహారాల సెక్రటరీ జనరల్‌గా కేకే

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నుంచి ఇటీవలే తెరాసలో చేరిన కె. కేశవరావు తెరాస జాతీయ వ్యవహారాల సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. రేపు తెలంగాణభవన్‌లో కేకే బాధ్యతలు స్వీకరించనున్నారు.

తెలంగాణ

ఉత్తరకాశీలో చిక్కుకున్న తెలుగువారి పరిస్థితిపై మంత్రి సమీక్ష

హైదరాబాద్‌ : ఉత్తరకాశీలో చిక్కుకున్న తెలుగువారి పరిస్థితిపై మంత్రి రఘువీరారెడ్డి సమీక్షించారు. సహాయక చర్యలపై ఆ రాష్ట్ర అధికారులతో చర్చించారు. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన మన రాష్ట్రానికి…