Tuesday, 3 November 2026

July 2013

తెలంగాణ

ఘనంగా అల్లూరి సీతారామరాజు 116వ జయంతి

హైదరాబాద్‌ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 116వ జయంతిని అల్లూరి సీతారామరాజు స్మారకసమితి, క్షత్రియ సేవా సమితి ఘనంగా నిర్వహించింది. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అల్లూరి విగ్రహానికి జూబ్లిహిల్స్‌ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పద్మరాజు తదితరులు పూలమాల వేసి…

తెలంగాణ

పొదల్లో ఆడ శిశువు లభ్యం

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా నవాబ్‌పేట మండలం గ్రేటువానంపల్లి శివారులోని పొదల్లో ఈరోజు ఉదయం స్థానికులు అడశిశువును గుర్తించారు. అస్వస్థతకు గురైన శిశువును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జాతీయం

థానేలో కూలిన భవనం: ముగ్గురు వ్యక్తుల మృతి

థానే,(జనంసాక్షి): మహారాష్ట్రలోని భీవండిలో గత అర్ధరాత్రి ఓ భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని నగరంలో ప్రముఖ ఆసుపత్రికి తరలించి…

సీమాంధ్ర

కలెక్టరేట్‌ను ముట్టడించిన సమైక్యవాదులు

కడప: సమైక్యాంధ్రకు మద్దతుగా ఈరోజు ఉదయం సమైక్యవాదులు కడప జల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

సీమాంధ్ర

జమ్మలమడుగులో ఆహార తనిఖీ అధికారుల దాడులు

కడప: కడప జిల్లా జమ్మలమడుగులో మామిడి నిల్వ కేంద్రాలు, హోటళ్ల పై ఆహార తనిఖీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రజలకు హానికరమైన రసాయనాలతో మామిడికాయలు పండిస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో భారీ స్థాయిలో మామిడి పండ్లు…

సీమాంధ్ర

చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు

టి.నగర్‌(రాజమండ్రి): రాష్ట్ర పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడికి తూర్పుగోదావరి జిల్లాలో ఘనస్వాగతం లభించింది. విశాఖపట్నం నుంచి విజయవాడ రోడ్డు మార్గంలో బయలుదేరిన చంద్రబాబు ఈరోజు ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. స్థానిక లాలాచెరువు సెంటర్‌ వద్ద తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

తెలంగాణ

ఈరోజు పసిడి ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలో ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,650 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 25,300 గా ఉంది.…

సాహిత్యం

శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు నాని

తిరుమల: సినీ నటుడు నాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నాని దంపతులు స్వామిసేవలో పాల్గొన్నారు. శ్రీవారి అలయం వద్ద నాని దంపతులను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. నాని దంపతులు…

తెలంగాణ

సీఎం కు వినతి పత్రం అందజేసిన సుధాకర్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కలిశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి వినతీపత్రం అందజేశారు.

ఖమ్మం

భద్రాచలంలో వెలసిన మావోయిస్టు పార్టీ పోస్టర్లు

ఖమ్మం,(జనంసాక్షి): భద్రాచలం పరిసారాల్లో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో స్థానిక రాజకీయ నాయకులు భయాందోళనకు గురవుతున్నారు.