Tuesday, 3 November 2026

July 2013

తెలంగాణ

త్రిమూర్తులకు హైకమాండ్‌ నుంచి పిలుపు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణపై రోడ్‌మ్యాప్‌ నవేదించి, కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ భేటీలో పాల్గొన్న త్రిమూర్తులకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను మంగళవారం ఉదయం హస్తిన…

సీమాంధ్ర

కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న జూనియర్‌ డాక్టర్లు

విజయవాడ, ఎన్టీఆర్‌ అరోగ్య విశ్వవిద్యాలయం: సిద్ధార్థ వైద్యకళాశాలలో ప్రారంభం కావాల్సిన పీజీ వైద్యుల నియమకాల కౌన్సెలింగ్‌ను జూనియర్‌ డాక్టర్లు అడ్డుకున్నారు. కళాశాల ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన జూనియర్‌ డాక్టర్లు శాశ్వత ప్రాతిపదికన నియమకాలు చేపట్టాలని అందోళన చేస్తున్నారు.

జాతీయం

దిగ్విజయ్‌సింగ్‌తో మర్రి శశిధర్‌రెడ్డి భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్వాజయ్‌సింగ్‌తో కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ అంశం, రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ

మహంకాళి ఆలయంలో రంగం వేడుక

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భవితవ్యంను స్వర్ణలత చెప్పారు. ఉత్సవ ఏర్పాట్లపై స్వర్ణలత సంతప్తి వ్యక్తం చేశారు. ప్రజలు అందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని ఆశ్వీరదించారు.

సీమాంధ్ర

పురందేశ్వరి నివాసం ఎదుట ఆందోళన చేపట్టిన ఐకాస విద్యార్థులు

విశాఖ: సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎస్‌జీవో, విద్యార్థి ఐకాస నాయకులు కేంద్ర మంత్రి పురందేశ్వరి నివాసాన్ని ముట్టడించారు. పురందేశ్వరి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.

తెలంగాణ

వైభవంగా జరుగుతున్న ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాలు రంగం వేడుకతో ఈ ఉదయం ప్రారంభమరయ్యాయి.

తెలంగాణ

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సీమాంధ్ర నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి:) ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సీమాంధ్ర నేతలు ఉండవల్లి అరుణ్‌కుమార్‌, వీఆరెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో ఢిల్లీ పరిణామాలు, తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ

నాంపల్లి కోర్టుకు హాజరైన ధర్మాన, సబిత

హైదరాబాద్‌,(జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో వీరిద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే.

సీమాంధ్ర

ఎంపీ సాయిప్రతాప్‌ నివాసం ముట్టడించిన సమైక్యాంధ్ర విద్యార్తులు

కడప, నేరవిభాగం: సమైక్యాంధ్రకు మద్దతుగా ఎంపీ సాయిప్రతాప్‌ నివాసాన్ని సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస, ఎన్జీవో నాయకులు ఈ ఉదయం ముట్టడించారు. సాయిప్రతాప్‌ తన పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి ఐకాస కన్వీనర్‌ రవిశంకర్‌రెడ్డి,…

సీమాంధ్ర

శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుతున్న వరద నీరు

కర్నూలు: కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. తుంగభద్ర, జూరాల జలాశయాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 2,36,610 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 1,36,900…