Wednesday, 4 November 2026

July 2013

తెలంగాణ

పోలింగ్‌ కేంద్రం వద్ద వృద్ధురాలి మృతి

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని కనగల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద విషాదం చోటు చేసుకుంది. ఓటు వేసి బయటకు వస్తుండగా ఓ వీద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. వృద్ధురాలి  మృతితో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

ఖమ్మం

స్థానికేతరులపై స్థానికుల దాడి

ఖమ్మం,(జనంసాక్షి): ఓటు వేయడానికి వచ్చిన స్థానికేతరులపై స్ధానికులు దాడి చేశారు. ఈ ఘటన ముత్తగూడెంలో చోటు చేసుకుంది. 30 మంది స్థానికేతరులను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు.

సీమాంధ్ర

వైకాపా నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఓటర్లకు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న నలుగురు వైకాపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

సీమాంధ్ర

ఓటు వేయనివ్వడంలేదని దళితుల ఆందోళన

చిత్తూరు,(జనంసాక్షి): యాదగిరి మండలం కోడిగుట్ట గ్రామంలో దళితులు ఆందోళనకు దిగారు. తమను  ఓటు  లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు భారీగా  మోహరించారు.

సీమాంధ్ర

మంత్రి రామచంద్రయ్య నివాసాన్ని ముట్టడించిన విద్యార్థులు

కడప: సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని డిమాండ్‌ చేస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయశాఖా మంత్రి సి. రామచంద్రయ్య నివాసాన్ని విద్యార్థులు ముట్టడించారు.

సీమాంధ్ర

నకిలీ ఓటర్లును అదుపులోకి తీసుకున్న పోలీసులు

చిత్తూరు: చిత్తూరు గ్రామీణ మండలం బంగారెడ్డిపల్లి పోలింగ్‌ కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం

ఓట్లు గల్లంతయ్యాయని సిబ్బందిపై దాడి

ఖమ్మం,(జనంసాక్షి):కొణిజెర్ల మండలంలో పల్లిపాడులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఎన్నికల విధులకు వచ్చిన సిబ్బందిపై దాడి చేశారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

సీమాంధ్ర

మండపాక గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలోని మండపాక గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ పార్టీకి చెందిన అభ్యర్థులు పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి ఓట్లు అభ్యర్థిస్తున్నారని ఆరోపిస్తూ మరో వర్గం నాయకులు ఘర్షణకు దిగారు.…

జాతీయం

రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: మంత్రి నర్సింహ

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో మంత్రి తోట నర్సింహ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. రాష్ట్ర విభజన అనివార్యమైతే సీమాంధ్ర మంత్రుల రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రి స్పష్టం…

ఎడిట్ పేజీ

‘శ్రమ శక్తి’ ఉపయోగపు విలువ గురించి

‘ఏ మాట ఏ సందర్భంలో అన్నాడో దాన్ని బట్టి ఉంటుంది అది. నువ్వు ఇచ్చేది శ్రమ శక్తి విలువే అయినా దాని పైన అదనపు విలువ ఉండి తీరుతుందని చూపించడానికే ఆ మాట అన్నాడు. నువ్విచ్చే జీతం శ్రామికుణ్ణి…