Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

భద్రాచలం డివిజన్లో వాయిదా పడిన ఎన్నికలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఖమ్మం జిల్లా భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని అన్ని మండలాల్లో ఎన్నికలను ఈ నెల 31 కి వాయిదా వేశారు. భారీ వర్షాలు ఉన్నచోట్ల ఆయా జిల్లాల కలెక్టర్ల సిఫార్సుల మేరకు పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయనున్నట్లు రాష్ట్ర…

సీమాంధ్ర

తల్లికొడుకుల ఆత్మహత్యాయత్నం

కాకినాడ,(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని డెయిరీ ఫారం కూడలిలీ తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుక్కి విషం ఇచ్చి ఓ తల్లి తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందినట్లు సమాచారం.

జాతీయం

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల హింస

కోల్‌కతా,(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌ పంచాయితీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు ముందు జరిగిన హింసాత్మక సంఘటనల్లో ముగ్గురు కాంగ్రెస్‌ మద్దతుదారులు మృతిచెందారు. ముర్షిదాబాద్‌ జిల్లాలోని వేర్వేరు గ్రామాల్లో జరిగిన బాంబుదాడుల్లో ఈ మరణాలు సంభవించినట్లు సమాచారం. కాంగ్రెస్‌, సీపీఎం ఇప్పటివరకు…

కరీంనగర్

ఏసీబీ వలలో చిక్కిన సబ్‌జైలు వార్డర్లు

కరీంనగర్‌,(జనంసాక్షి): జగిత్యాల సబ్‌జైలు వార్డర్లు రవీందర్‌రెడ్డి, వేణు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రిమాండ్‌ ఖైదీ తిరుపతి నుంచి రూ. 8 వేలు , 25 కిలోల బియ్యం తీసుకుంటుండగా వార్డర్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

సీమాంధ్ర

రేపటి నుంచి ఎంబీబీఎస్‌, బీడీఎన్‌ కౌన్సెలింగ్‌

విజయవాడ,(జనంసాక్షి): సోమవారం నుంచి ఈనెల 29 వరకు ఎంబీబీఎస్‌, బీడీఎన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ ఐవీ రావు ఆదివారం తెలిపారు. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి కేంద్రాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ

రఘువీరారెడ్డితో యూపీ సీఎం భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డితో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ సమావేశమయ్యారు. రఘువీరారెడ్డితో కలిసి అప్పహార విందులో ఆయన పాల్గొన్నారు. నాగోలులో జరిగే అఖిల భారత యాదవ మహాసభ సమావేశాల్లో పాల్గొనే అఖిలేష్‌ యాదవ్‌ నగరానికి వచ్చేశారు.

జాతీయం

సంజయ్‌దత్‌కు జైలులో వైద్య పరీక్షలు

పుణె,(జనంసాక్షి): ఎరవాడ జైలులో ఉన్న బాలివుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు వైద్యులు శనివారం నాడు జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. షెడ్యూలులో భాగంగానే వైద్య పరీక్షలు చేశామని, ఆయనను ఇతర ఖైధీల్లాగా బయట ఆస్పత్రికి తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి…

వార్తలు

ముగిసిన విద్యాధరరావు అంత్యక్రియలు

కామవరపుకోట,(జనంసాక్షి): శనివారం గుండెపోటుతో మృతిచెందిన మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని తూర్పు యడవెళ్లి గ్రామంలో ఈ ఉదయం నిర్వహించారు. గ్రామంలోని వ్యవపాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రాజ్యసభ…

తెలంగాణ

చిరంజీవిని కలిసిన యూపీ సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ కేంద్ర పరాయ్టక శాఖ మంత్రి చిరంజీవి ఈ ఉదయం ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అఖిలేష్‌ యాదవ్‌ను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు గంటా, వట్టి వసంతకుమార్‌ కలిశారు. నేడు…

సీమాంధ్ర

జలదిగ్భంధంలో 40 లంక గ్రామాలు

రాజమండ్రి,(జనంసాక్షి): ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో 40 లంక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వరద ముప్పులో 24 వేల కుటుంబాలు ఉన్నాయి. 1300 మంది వరద బాధితులను పునరావస కేంద్రాలకు తరలించినట్లు…