Thursday, 5 November 2026

July 2013

Featured News

సోనియా, షిండేతో నాదెండ్ల భేటీ

తెలంగాణ తీర్మానంపై చర్చ న్యూఢిల్లీ, జూలై 18 (జనంసాక్షి) : తెలంగాణపై హస్తినలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర…

Featured News

కాశ్మీర్‌లో జవాన్ల కాల్పులు

ఆరుగురి మృతి.. పలువురికి గాయాలు విచారణకు ఆదేశించిన షిండే శ్రీనగర్‌, జూలై 18 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ జవాన్లు రెచ్చిపోయారు. రంబాన్‌ జిల్లాలో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు సాధారణ…

Cover Story

పది జిల్లాల తెలంగాణే కావాలి

సాగిదీస్తే సాగనంపుడే : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి) : పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే కావాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని మరింత…

సీమాంధ్ర

కౌలు రైతు ఆత్మహత్య

చందర్లపాడు,(జనంసాక్షి): కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పున్నవల్లిలో ఓ కౌలురైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

జాతీయం

డోపింగ్‌టెస్ట్‌లో విఫలమైన సాంగ్వన్‌

ముంబయి,(జనంసాక్షి): కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్‌ ప్రదీప్‌ సాంగ్వన్‌ ఐపీఎల్‌ సందర్భంగా నిర్వహించిన డోపింగ్‌ విఫలమయ్యాడు. దీనికి సంబంధించి ప్రస్తుతం మొదటి విడత పరీక్షలు పూర్తయ్యాయి. రెండో విడత పరీక్షల ఫలితాలు వెలువడ్డాక దీనిపై ఓ నిర్ణయానికి వస్తామని బీసీసీఐ…

జాతీయం

సినీ గేయ రచయిత వాలీ కన్నుమూత

చెన్నై,(జనంసాక్షి): ప్రఖ్యాత సినీ గేయ రచయిత వాలీ(85) కన్ను మూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 5 దశాబ్దాలుగా ఆయన 10 వేల పాటల వరకు రాశారు.

తెలంగాణ

నర్సంపేట సీఐ సస్పెండ్‌

వరంగల్‌,(జనంసాక్షి): నర్సంపేట సీఐ శివసాంబరెడ్డిని డీఐజీ కాంతారావు గురువారం సస్పెండ్‌ చేశారు. నల్లబెల్లం పట్టుకుని వ్యాపారులకు విక్రయించినట్లు విచారణలో తేలడంతోనే సీఐని సస్పెండ్‌ చేసినట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ

దియాష్‌ సంస్థకు రైజింగ్‌స్టార్‌ అవార్డు

హైదరాబాద్‌,(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా ఉన్నత ప్రమాణాలు పాటించే నగల దుకాణాలకు ఇచ్చే అంతర్జాతీయ ద రైజింగ్‌స్టార్‌ అవార్డును హైదరాబాద్‌కు చెందిన దియాష్‌ అనే సంస్థకు దక్కింది. ఈ అత్యుత్తమ అవార్డు తమ దుకాణానికి లభించడం గర్వంగా ఉందని సంస్థ…

అంతర్జాతీయం

టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

లండన్‌,(జనంసాక్షి): లార్డ్స్‌ వేదికగా యూషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో టెస్టులో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 5 టెస్టుల సిరాస్‌లో ఇంగ్లండ్‌ 1-0 ఆధిక్యంలో ఉంది.

తెలంగాణ

ఎన్నికల కార్యదర్శితో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీపీఐ రాష్ట్ర కర్యాదర్శి నారాయణ గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ను కలిశారు. పశ్చిమగోదావరి జిల్లా గుడివాకలంకలో అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని నారాయణ ఫిర్యాదు చేశారు. వేలంపాట, ధన ప్రభావం, అధికార దుర్వినియోగంతోనే పలు…