Tuesday, 3 November 2026

August 2013

జాతీయం

సురవరం సుధాకర్‌రెడ్డితో దిలీప్‌కుమార్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్‌ రెడ్డితో టీఆర్‌ఎల్డీ నేతలు, ఎమ్మెల్యే దిలీప్‌కుమార్‌ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సురవరంకు వినతి పత్రం అందజేశారు.

వార్తలు

సభలకు అనుమతి స్తే ఘర్షనలు జరిగే అవకాశం : నారాయణ

హైదరబాద్‌: హైదరాబాద్‌లో సమైక్య, విభజన  సభలకు అనుమతిస్తే ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ద్వారా కేంద్రమే రెండు వాదలనూ ప్రోత్సహిస్తోందని నారాయణ అన్నారు. జగన్‌ జైల్లో దీక్ష చేస్తుంటే విజయమ్మ…

జాతీయం

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. 2జీ కుంభకోణానికి సంబంధించిన జేపీసీలో కేంద్రప్రభుత్వం ఈరోజు రాజ్యసభకు చెందిన మరో ఇద్దరు సభ్యులను నియమించింది. కాంగ్రెస్‌ సభ్యుడు పి. భట్టాచార్య నామినేటెడ్‌ సభ్యుడు అశోక్‌ గంగూలీలను ప్రభుత్వం జేపీసీలో నియమించింది.…

తెలంగాణ

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలి :మందా జగన్నాథం

హైదరాబాద్‌,(జనంసాక్షి): వెంటనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాట్టాలని ఎంపీ మందా జగన్నాథం డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రక్రియ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని ప్రభుత్వ అధినేత చెప్పారని, సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు ఉపసంహరించాలని ఆయన అన్నారు.

వార్తలు

బొగ్గు కుంభకోణం సీబీఐ మందకొడి దర్యాప్తు పై సుప్రీం ఆగ్రహం

ఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ మందకొడి దర్యాప్తు పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 169 సంస్థలపై దర్యాప్తును వేగవంతం చేయాలని  సీబీఐని  సుప్రీంకోర్టుఆదేశించింది. 4 లేదా 5నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది.…

జాతీయం

పార్లమెంట్‌లో రేపు ప్రకటన చేస్తా : మన్మోహన్‌సింగ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): రూపాయి పతనంపై  పార్లమెంట్‌ సభ్యుల ఆందోళన వాయిదా అనంతరం కూడా కొనసాగడంతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పందించారు. రూపాయి పతనంపై సభ్యుల ఆందోళన, అభిప్రాయాలను గౌరవిస్తామని, రేపు సభలో ప్రకటన చేస్తానని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలిపారు.

జాతీయం

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

ఢిల్లీ,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభంలో ఉండగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభంలో ఉంది.

వార్తలు

రేపు పార్లమెంటులో ప్రకటన చేస్తా: ప్రధాని

ఢిల్లీ: రూపాయి పతనం పై పార్లమెంటు సభ్యుల ఆందోళన వాయిదా అనంతరం కూడా కొనసాగడంతో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్పందించారు. రూపాయి పతనంపై సభ్యుల ఆందోళన. అభిప్రాయాలను గౌరవిస్తామని, రేపు సభలో ప్రకటన చేస్తానని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌…

జాతీయం

రూపాయి పతనంపై స్పందించిన ప్రధాని

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రూపాయి పతనంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పందించారు. ప్రస్తుతం క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నామని ప్రధాని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి దేశీయ కారణాలను కూడా తిరస్కరించలేమని ఆయన తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితిపౌ శుక్రవారం రాజ్యసభలో ప్రధాని…