Tuesday, 3 November 2026

August 2013

ఎడిట్ పేజీ

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు

ఝాన్సీ రాణి వెన్నంటి నిలిచి ప్రాణాలర్పించిన యోధురాలు ముందర్‌ 1857 నాటి గ్రామంలో మాతృభూమిని బ్రిటిష్‌ పాలకుల నుండి విముక్తి చేయడానికి కులమతాలకు అతీతంగా ప్రజలు పోరులో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలలోని స్వదేశీ పాలకుల పక్షాన తిరుగు బాటు…

ఎడిట్ పేజీ

తెలంగాణపై ఎందుకు లేఖ రాయలేదు?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్ర సాగుతున్న కృత్రిమ ఉద్యమానికి సహజత్వం ఆపాదించేందుకు సీఎం కిరణ్‌, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేయని ప్రయత్నాలు లేవు. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకొని…

తెలంగాణ

హైదరాబాద్‌ సహా పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేటలో భారీవర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నల్గొండ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో భారీవర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి.

జాతీయం

భత్కల్‌ను కోర్టుకు హాజరుపర్చిన పోలీసులు

బీహార్‌,(జనంసాక్షి): ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ను పోలీసులు మోతిహార్‌ కోర్టుకు హాజరుపర్చారు. కోర్టును ఎస్‌ఐఏ అధికారులు భత్కల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు.

ఖమ్మం

వేడుకగా క్రీడా దినోత్సవం

ఖమ్మం,(జనంసాక్షి):  క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఖమ్మం స్గేడియంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో బాస్కెట్‌బాల్‌, అథ్లెటిక్‌ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.

ఆదిలాబాద్

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

కాగజ్‌నగర్‌,(జనంసాక్షి): నగరంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్‌ కార్యలయం, మున్సిపల్‌ కార్యాలయం ఎదుట అధికారులు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌, ఉప తహశీల్దార్‌ శైలజ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

సెప్టెంబర్‌ 1నుంచి 7వరకు ముల్కీ అమరవీరుల వారోత్సవం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సెప్టెంబర్‌ 1నుంచి 7వరకు తెలంగాణ రాజకీయ ఐకాస ముల్కీ అమరవీరుల వారోత్సవ  కార్యక్రమాలు నిర్వహిచనున్నారు. సెప్టెబరు 1న హైదరాబాద్‌, 2న ఆదిలాబాద్‌, 3న నిజామాదబాద్‌, 4న కరీంగర్‌, 5న వరంగల్‌, 6న మహబూబ్‌నగర్‌లో అమరవీరుల వారోత్సవం జరుపనున్నారు.…

జాతీయం

పుదుచ్చేరి మాజీ లెప్టినంట్‌ గవర్నర్‌ కన్నుమూత

నాగ్‌పూర్‌,(జనంసాక్షి): పుదుచ్చేరి మాజీ లెప్టినెంట్‌ గవర్నర్‌, విద్యావేత్త డాక్టర్‌ రజనీ రాయ్‌ గురువారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె వయసు 83 ఏళ్లు. ఆమెకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. స్థానిక బాలికల కళాశాలకు …

జాతీయం

భత్కల్‌ కస్టడీ కోరనున్న కర్ణాటక పోలీసులు

బెంగళూరు,(జనంసాక్షి): కర్ణాటక పోలీసులు కూడా ఉగ్రవాది యాసిస్‌ భత్కల్‌ కస్టడీ కోరనున్నారు. బెంగళూరులో జరిగిన ఉగ్రవాదుల గురించి అతడిని ప్రశ్నించడానికి కస్టడీ కోరుతామని, అయితే అందుకు సమయం పడుతుందని కర్ణాటక డీజీపీ తెలిపినట్లు సమాచారం.

జాతీయం

కోల్‌స్కాం దర్యాప్తు వేగవంతం చేయండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ మందకొండి దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 169 సంస్థలపై దర్యాప్తు వేగవంతం చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 4 నెలత్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది.…