Tuesday, 3 November 2026

August 2013

వార్తలు

భూసేకరణ బిల్లుపై లోక్‌ సభలో చర్చ

ఢిల్లీ: వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్‌ సభలో భూ సేకరణ బిల్లుపై చర్చ జరుగుతోంది. భాజపా అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌ ఈ చర్చను ప్రారంభించారు. మరోపక్క ఆర్థిక పరిస్థితి పై ప్రధాని ప్రకటనకోసం సభ్యుల ఆందోళన కొనసాగుతోంది.

తెలంగాణ

మాహక్కులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించం: కోదండరామ్‌

హైదరాబాద్‌: తమ హక్కులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించమని తెలంగాణ ఐకాస ఛైర్మెన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణకు అడ్డుపడితే వూరుకునేది లేదని, వచ్చే నెల 7న హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. సమస్యకు పరిష్కారం చూపిల్సిన…

తెలంగాణ

జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): చంచల్‌గూడ జైల్లో దీక్ష చేస్తున్న జగన్‌కు ఈ ఉదయం వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. జగన్‌కు గ్లూకోజ్‌ లెవల్స్‌ పూర్తిగా పడిపోయాయని వైద్యులు తెలిపారు. దీక్ష విరమించాల్సిందిగా జగన్‌కు  వైద్యులు సూచించారు.

జాతీయం

డిసెంబర్‌లో జీఎస్‌ఎల్వీ ప్రయోగం : ఇస్రో

బెంగళూరు,(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీఎస్‌ఎల్వీ-డీ5ను డిసెంబర్‌లో ప్రయోగించే అవకాశం ఉందని బుధవారం ఇస్రో అధికారులు తెలిపారు. కమ్యూనికేషన్‌ ఉపగ్రహంతో ఈ నెల 19 న నింగికి ఎగరాల్సిన జీఎస్‌ఎల్వీ-డీ5 ప్రయోగాన్ని దానిలోని…

తెలంగాణ

వ్యాన్‌ బోల్తా: ఆరుగురి మృతి

నల్లగొండ,(జనంసాక్షి): దేవరకొండ మండలం కొండమల్లేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోని తప్పించబోయి డీసీఎం బోల్లా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి…

తెలంగాణ

ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ అరెస్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఇండియన్‌ ముజాహుద్దీన్‌ వ్యవస్థాపకుడు, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది యాసిస్‌ భత్కల్‌ను ఎస్‌.ఐ.ఏ అధికారులు అరెస్టు చేశారు. ఇండో-నేపాల్‌ సరిహద్దులో భత్కల్‌ను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో భత్కల్‌ ప్రధాన నిందితుడు.

తెలంగాణ

సెప్టెంబర్‌ 4 వరకు నగరంలో నిషేదాజ్ఞలు : అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌,(జనంసాక్షి): నేటి నుంచి వచ్చే నెల 4 వరకు హైదరాబాద్‌లో నిషేదాజ్ఞలు విధిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధిస్తున్నట్లు సీపీ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం బీఆర్‌కే…

అంతర్జాతీయం

యూఎస్‌ ఓపెన్‌లో సోమ్‌దేవ్‌ శుభారంభం

న్యూయార్క్‌,(జనంసాక్షి):యూఎస్‌ ఓపెన్‌ భారత క్వాలిఫైయర్‌ సోమ్‌దేవ్‌ శుభారంభం చేశాడు. మొదటి మ్యాచ్‌లో సోమ్‌దేవ్‌ యూఎస్‌ ఆటగాడు స్లోవాకియాపై 4-6, 6-1, 6-2, 4-6, 6-4 తేడాతో విజయం సాధించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయమేర్పడంటంతో పలు దఫాలుగా ఎనిమిది…

తెలంగాణ

నేడు తెలంగాణ పీఆర్‌టీయూ శాంతిదీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో ఒక్కరోజు శాంతి దీక్షను చేపట్టనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, కోదండరామ్‌, దేవీశ్రీప్రసాదరావు, విఠల్‌, శ్రీనివాస్‌గౌడ్‌ హాజరు కానున్నట్లు తెలిపారు.…

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): నిన్న నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. రూపాయి విలువ స్వల్పంగా కోలుకుంటుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.…