Tuesday, 3 November 2026

August 2013

తెలంగాణ

కెసిఆర్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

-విగ్రహాలు ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి – డిజిపిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి -కరీంనగర్‌ ఎంపి పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌ సిటీ, ఆగస్టు 4 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అకారణంగా…

సీమాంధ్ర

46 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి

తూర్పుగోదావరి: గోదావరి వరద ఉద్ధృతికి కోనసీమలో 46 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 46 గ్రామాల్లో దాదాపు లక్షా 30 వేల మంది ఉన్నారు. ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పి. గన్నవరం అక్డిడెక్టు…

తెలంగాణ

వైభవంగా ప్రారంభమైన బోనాల ఉత్సవాలు

హైదరాబాద్‌: లాల్‌ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

తెలంగాణ

కేజీ బంగారం స్వాధీనం చేకున్న కస్టమ్స్‌ అధికారులు

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో దుబాయి నుంచి వస్తున్న కేరళవాసి సిరాజ్‌ నుంచి కస్టమ్స్‌ అధికారులు కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సిరాజ్‌షూ సాక్స్‌లో పెట్టుకున్న బంగారాన్ని అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 27లక్షలు ఉంటుందని…

తెలంగాణ

కె.టి. దొడ్డి గ్రామంలో ట్రాక్టర్‌ బోల్తా: ముగ్గురి మృతి

గట్టు: మహబూబ్‌నగర్‌ జిల్లా గట్టు మండలం కె.టి.దొడ్డి గ్రామంలో ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైతులు అక్కడికక్కడే మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ధరూర్‌ మండలం గువ్వలదిన్నె గ్రామస్థులుగా గుర్తించారు.

సీమాంధ్ర

పురుగుల మందు తాగి ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల మండలం పిట్లవాని పాలెం గ్రామానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఏపూరి శ్రీనివాసరావు (42) బాపట్ల రైల్వే స్టేషన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీఎస్పీ నల్గొండ బెటాలియన్‌కు చెందిన శ్రీనివాసరావు ప్రస్తుతం…

తెలంగాణ

తగ్గుతున్న గోదావరి నది

వరంగల్‌: జిల్లాలోని ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమా

తిరుమల: తిరుమల శ్రీవారిని మైలవరం తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వర రావు దర్శించుకున్నారు. శనివారం రాత్రి అలిపిరి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్న ఉమా ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం…

సీమాంధ్ర

వరద నీటిలో వెళ్తుండగా పాము కాటుకు గురై నరసింహమూర్తి మృతి

మామిడి కుదురు: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి గ్రామానికి చెందిన గ్రామ సేవకుడు ఆకుమర్తి నరసింహమూర్తి (55) మృతి చెందాడు. గోదావరి వరద ఉద్ధృతికి అప్పనపల్లి గ్రామం వరద నీటిలో ఉంది. గ్రామ సేవకుడిగా పనిచేసే నరసింహమూర్తి…

వార్తలు

బస్సు- ద్వి చక్రవాహం ఢీ: ఇద్దరు సజీవ దహనం

బరంపురం(ఒడిశా) : గంజామ్‌ జల్లాలోని షమాకండి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 16వ నెంబరు జాతీయ రహదారిపై, సీతానగర్‌ వద్ద మిని బస్సు-ద్వి చక్రవాహం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు పెట్రోలు ట్యాంకు పేలింది. ఈ దుర్ఘటనలో మిట్టూ ప్రధాన్‌,…