Thursday, 5 November 2026

August 2013

కరీంనగర్

రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి : గంగుల కమలాకర్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణవాదులను రెచ్చగొట్టే చర్యలు సీమాంధ్ర నేతలు మానుకోవలని టీఆర్‌ఎస్‌ నేత కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే పరిస్థితులు తీవ్రంగా మారతాయని అప్పుడు తెలంగాణ నేతలెవరూ బాధ్యులు కారని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ

ధర్మానకు మరోసారి సీబీఐ నోటీసులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. లేపాక్షి భూకేటాయింపు వ్యవహారంలో హాజరు కావాలని ఈ నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.

జాతీయం

పాక్‌కాల్పులను తిప్పి కొట్టిన భారత జవాన్లు

జమ్మూ కాశ్మీర్‌,(జనంసాక్షి): దాయాది దేశం పాకిస్థాన్‌ మళ్లీ భారత సరిహద్దులోల కాల్పులకు తెగబడింది. ఈ కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. పూంఛ్‌ జిల్లాలోని హమీర్‌పూర్‌, మేంధర్‌ సరిహద్దుల్లో ఇవాళ పాక్‌ సైనిక మూకలు కాల్పులు జరిపారు. అందుకు…

జాతీయం

లోక్‌సభ ఎల్లుండికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ ఎల్లుండికి వాయిదా పడింది. రేపు రక్షాబంధన్‌ సెలవు కావడంతో సభ సమావేశాన్ని ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు

తెలంగాణ

యూటీ చేస్తే అగ్నిగుండమే: మంత్రి దానం

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే అగ్నిగుండమే అవుతుంది. అని మంత్రి దానం నాగేందర్‌ హెచ్చరించారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు. ఈ విషయమై తాను…

జాతీయం

ఫైళ్లు గల్లంతు కాలేదు, గల్లంతు చేశారు :జైట్లీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు మాయమవడంపై మండిపడింది. ఇవాళ రాజ్యషభలో చర్చ సందర్భంగా ఆ పార్టీ సభ్యుడు అరుణ్‌ జైట్లీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఫైళ్లు గల్లంతు కాలేదని, మాయం చేశారని ఆయన విమర్శించారు. ఫైళ్ల మాయంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన…

జాతీయం

నేడు ఆంటోని కమిటీ ముందుకు సీఎం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ ఇవాళ ఉదయం హస్తిన చేరుకున్నారు. రాష్ట్ర విభజనపై ఆయన మరిన్ని వివరాలతో ఆంటోని కమిటీ ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్ర విభజనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేదిలేదని ఆయన తేల్చిచెప్పనున్నట్టు సమాచారం.…

జాతీయం

రాజ్యసభ రెండు గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ మళ్లీ వాయిదా పడింది. ఇవాళ ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి విపక్ష సభ్యులే ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. సభలో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.

జాతీయం

బొగ్గు ఫైళ్ల అదృశ్యాన్ని లేవనెత్తిన బీజేపీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ ఉభయసభల్లో బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఫైళ్ల అదృష్యాన్ని బీజేపీ లేవనెత్తింది. ఫైళ్ల అదృశ్యంపై ప్రధాని సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. లోక్‌సభలో సుష్మాస్వరాజ్‌, రాజ్యసభలో వెంకయ్యనాయుడు ఈ అంశాన్ని లేవనెత్తారు.

తెలంగాణ

ఢిల్లీ చేరుకున్న సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి:) ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు సీఎం వివరించనున్నారు. ఆంటోని కమిటీతో పాటు, ఇతర పార్టీ పెద్దలను కూడా సీఎం కలవనున్నట్లు సమాచారం.