Wednesday, 4 November 2026

August 2013

హైదరాబాద్

పార్టీ కాదు, కేంద్ర ప్రభుత్వ కమిటీ వేయాలి : వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: సీమాంధ్ర ప్రజల ఆందోళనలపై పార్టీ కమిటీ కాదు, కేంద్ర ప్రభుత్వ కమిటీ వేయాలని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు సూచించారు. సున్నిత భావోద్వేగాలతో కూడిన అంశంపై కాంగ్రెస్‌ ఉద్వేగాలను రెచ్చగొడుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. ఒకే వాదనలు లేకుండా…

హైదరాబాద్

సాయంత్రం 4గంటలకు కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌

హైదరాబాద్‌: తెలంగాణపై అవాస్తవాలు మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలకు కేసిఆర్‌ కౌంటర్‌ అటాక్‌ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ మీడియాతో మాట్లాడనున్నారు. కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ కోసం తెలంగాణవాదులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్పొర్ట్స్

ఓటమిపాలవుతున్న భారత క్రీడాకారులు

చైనా: వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకరులు ఓటమి చవి చూస్తున్నారు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో సైనా వరుస సెట్లతో ఓడిపోగా, క్వార్టర్‌ ఫైనల్లో  కశ్యప్‌ కూడా ఓటమిపాలయ్యారు.

హైదరాబాద్

ఎమెల్యే ధర్మాన రాజీనామ

హైదరాబాద్‌: సమైక్యాంధ్రకు మద్దతుగా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేశారు. ధర్మానతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో పలాస ఎమ్మెల్యే మీసాల నీలకంఠం, ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌ ఉన్నారు.

మహబూబ్ నగర్

ప్రత్యేక తెలంగాణ నిర్ణయం శిలాశాసనం

మహబూబ్‌నగర్‌: హైదరాబాద్‌ తెలంగాణలో భాగమేనని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై తీసుకున్న నిర్ణయం శిలాశాసనమని ఆయన మహబూబ్‌నగర్‌లో అన్నారు. నదీ జలాల పంపిణీని అంతర్రాష్ట్ర నదీ జలాల బోర్డు చూసుకుంటుందని చెప్పారు. సీమాంధ్రలో ఆందోళనలకు అక్కడి…

హైదరాబాద్

తెలంగాణ ప్రజలు విశాలాంధ్ర కోరుకోవట్లేదు

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవం,స్వయం పాలనకు సంబంధించిందని ఉప ముఖ్యమంత్రి దామెదర రాజనర్సింహా అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ది ప్రెస్‌ లో ఉపముఖ్యమంత్రి మాట్లాడారు. ఇదివరకు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్నే మేము డిమాండ్‌ చేశామని పేర్కొన్నారు. తెలంగాణలో…

నిజామాబాద్

కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం డీఎస్‌

నిజామాబాద్‌: తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పీసీసీ మాజీ అధినేత డీఎస్‌ అన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణపై ముఖ్యమంత్రి చెప్పినవన్నీ పచ్చీ అబద్దాలని అన్నారు. ప్రజలను,…

హైదరాబాద్

సీఎం వ్యాఖ్యలపై టీజేఏసీ చర్చ

హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ కార్యాలయంలో జేఏసీ నేతలు భేటీ అయ్యారు. సీఎం చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.

నల్లగొండ

కిరణ్‌కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదు: ఎంపీ గుత్తా

నల్గొండ: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల ప్రజల మధ్య సామరస్యం నెలకొల్పాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు.

హైదరాబాద్

సీఎం వ్యాఖ్యలపై బొత్సతో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. సీఎం వ్యాఖ్యలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. బొత్సతో భేటి అయిన ఈ సమావేశంలో జానారెడ్డి, దానం నాగేందర్‌, సుదర్శన్‌రెడ్డి, పాల్వాయి…