Wednesday, 4 November 2026

September 2013

వార్తలు

మావోయిస్టుల కాల్పుల్లో జవాను మృతి

బీహర్‌: బీహర్‌లోని జాముయ్‌ జిల్లాలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌కి చెందిన ఒక జవాను మృతి చెందాడు. మరో ఇద్దరు గామపడ్డారు. సీఆర్‌పీఎఫ్‌కి చెందిన నిర్మాణంలో ఉన్న ఒక భవనాన్ని మావోయిస్టులు గురువారం రాత్రి పేల్చి…

వార్తలు

90 కిలోల గంజాయి పట్టివేత

హైదరాబాద్‌: నల్గొండలో పోలీసులు అక్రమంగ తరలిస్తున్న 90కిలోల గంజాయిని పట్టుకున్నారు. అందుకు బాధ్యులైన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.40 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

వార్తలు

మావోయిస్టుల పేరిట ఏర్పడ్డ ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత ఏనుగు ప్రభాకరరావు హంతకులను చంపేందుకు  మావోయిస్టుల పేరిట ఏర్పడిన ఐదుగురు సభ్యుల ముఠాను కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

వార్తలు

రాగల 48గంటల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల రాగల 48 గంటల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, ఖమ్మం మహబూబ్‌నగర్‌, మెదక్‌జిల్లాల్లో, కోస్తాంధ్రలోని…

వార్తలు

ముగిసిన కేంద్ర కేబినెట్‌ భైఠక్‌

న్యూఢిల్లీ: ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం డీఏను పెంచుతూ కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈసమావేశంలో తెలంగాణ బిల్లు చర్చకు రానట్లు సమాచారం.

వార్తలు

సీబీఐ కోర్టుకు హాజరైన ధర్మాన, సబిత

హైదరాబాద్‌: జగన్‌ అక్రమార్కుల కేసులో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డి ఈ రోజు ఉదయం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

వార్తలు

ఏసీబీ వలలో సీనియర్‌ అసిస్టెంట్‌

హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లా ఆర్డీవో కార్యలయం సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గోపాల్‌రెడ్డి ఏసీబీ వలలో చిక్కారు. లబ్ధిదారుడి నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం గోపాల్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి.

వార్తలు

అక్రమంగా కలప తరలిస్తున్న వ్యక్తులు అరెస్టు

హైదరాబాద్‌: విశాఖజిల్లా పాడేరు ఏజెన్సీలో అక్రమంగా కలప తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కలపతో పాటు మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వార్తలు

ఆర్‌డబ్ల్యూ ఎస్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల సమ్మె

నట్లగొండ : జిల్లాలో ఈ రోజు నుంచి ఆర్‌డబ్య్లూఎస్‌ కాంట్రాక్ట్‌ కార్మకులు సమ్మె చేపట్టారు. కార్మకుల సమ్మెతో దాదాపు 600 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.

వార్తలు

అక్టోబర్‌ 9 నుంచి ఇంటర్‌ కాలేజీలకు సెలవులు

హైదరాబాద్‌: అక్టోబర్‌ 9 నుంచి 17వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ కాలేజీలకు సెలవులు ప్రకింటించారు. త్రైమాసిక పరీక్షలు అక్టోబర్‌ 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 12 నుంచి 20వ…