Wednesday, 4 November 2026

November 2013

హైదరాబాద్

సెన్సెక్స్‌ 400 పాయింట్లు పైకి

హైదరాబాద్‌ : సోమవారం భారత స్టాక్‌ మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 454 పాయింట్లు, నిఫ్టీ 134 పాయింట్లు లాభంలో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్‌, స్తిరాస్థి షేర్లు లాభాల దిశలో సాగుతున్నాయి.

జాతీయం

ముఖ్యమంత్రి మీడియా సమావేశం ప్రారంభం

ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన మంత్రుల బృందంతో గంటన్నరపాటు సమావేశమైన అనంతరం ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించే దిశగా మరో పెద్ద సమస్యను సృష్టించడం…

జిల్లా వార్తలు

నార్కట్‌పల్లి కామినేనిలో మెడికో ఆత్మహత్య

నల్లగొండ : నార్కట్‌పల్లిలో కామినేని మెడికల్‌ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీలో పీజీ మెడికల్‌ మొదటి సంవత్సరం చదువుతోన్న సాయి సురేష్‌ అనే విద్యార్ధి ఆత్మహత్యకు ప్పాడ్డాడు. మృతుడు హైదరాబాద్‌కు చెందినవాడు. అయితే, విద్యార్థి…

జాతీయం

సోనియాపై రూ. 10కోట్ల పరువునష్టం దావా

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పరువునష్టం దావా వేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రకటనలో తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేసినందుకు శివరాజ్‌సింగ్‌ చౌహాస్‌ సోనియాపై రూ.10కోట్లకు పరువునష్టం దావా వేశారు.

జిల్లా వార్తలు

నకిరేకల్‌లో రచ్చబండ రచ్చరచ్చ

నల్లగొండ : నకిరేకల్‌ పట్టణంలో మండల కార్యాలయంలో నిర్వహించన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చయింది. ఇవాళ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు కొందరు రచ్చబండ వేదికపై ఏర్పాటు చేసిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఫ్లెక్సీని చించేశారు. నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు…

జాతీయం

విజయవంతమైన ‘బ్రహ్మోస్‌’ క్షిపణి పరీక్ష

రాజస్థాన్‌ : సూపర్‌సోనిక్‌ క్షిపణి ‘బ్రహ్మోస్‌’ పరీక్ష విజయవంతంగా జరిగింది. రాజస్థాన్‌లోని సోఖ్రాన్‌ నుంచి ఈ క్షిపణిని ఈ రోజు ప్రయోగించారు.

హైదరాబాద్

వైఎస్‌ జగన్‌కు ఎదురుదెబ్బ

హైదరాబాద్‌ : వ్యాపారవేత్త వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ను సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దేశమంతా పర్యటించేందుకు అనుమతించాలని జగన్‌ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అక్రమాస్తుల కేసులో జగనే కీలకమని, అనుమతి ఇవ్వోద్దంటూ సీబీఐ వాదించింది.

జాతీయం

జీవోఎంతో సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ : ఢిల్లీలోని రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం)తో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సమావేశమయ్యారు. జీవోఎం ఎదుట సీఎం వినిపించే వాదనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

హైదరాబాద్

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

కుత్బుల్లాపూర్‌ (హైదరాబాద్‌) : జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, బాలికను బీరువాలో బంధించాడు. పోలీసుల కథనం ప్రకారం… కుత్బుల్లాపూర్‌లోని సంజయ్‌గాంధీ నగర్‌ (గుబురుగుట్ట) కాలనీకి చెందిన బొబ్బులు (26)…

సీమాంధ్ర

ఆటో, ట్రాక్టర్‌ ఢీ : ముగ్గురి మృతి

ఉంగుటూరు : పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం 16వ జాతీయ రహదారిపై కైకరం వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. భీమడోలు నుంచి నారాయణపురం ఐస్‌ ఫ్యాక్టరీకి వెళ్తున్న ఆటోని రాంగ్‌ రూటులో…