Wednesday, 4 November 2026

November 2013

స్పొర్ట్స్

ఐదో వికెట్‌ కోల్పోయిన విండీస్‌ ,87 పరుగుల వద్ద గేల్‌ ఔట్‌

ముంబయి, : భారత్‌ ,విండీస్‌ మధ్య జరుగుతున్న రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ 87పరుగుల వద్ద వికెట్‌ కోల్పోయింది. గేల్‌ 35 పరుగులు చేసి ఓజా బౌలింగ్‌లో ధోనికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

ఖమ్మం

ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రిలో నాలుగేళ్ల చిన్నారి అదృశ్యం

హైదరాబాద్‌ : ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగేళ్ల చిన్నారి అదృశ్యమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు.

హైదరాబాద్

వైసీపీలో చేరిన మోపీదేవి

హైదరాబాద్‌ : మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. జగన్‌ సమక్షంలో మోపిదేవితో పాటు ఆయన అనుచరులు వైసీపీలో చేరారు. జగన్‌ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

హైదరాబాద్

టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల అదుపులో వ్యభిచార ముఠా

హైదరాబాద్‌ : జంజారాహిల్స్‌ పరిధిలోని కమలాపురి కాలనీలో వ్యభిచార ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అర్ధరాత్రి మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. సుబ్బారెడ్డి ,కృష్ణ అనే ఎపీఎస్పీ 12వ బెటాలియన్‌ ,కానిస్టేబుళ్లు, సురేష్‌,అనే వ్యక్తితో కలిసి ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు…

హైదరాబాద్

నేడు మొహరం పర్వదినం

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా మొహరం వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో మొహరం వేడుకలకు పోలీసులు పటిష్ట బందోబస్తు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొహరం సందర్బంగా ఇవాళ నెల్లూరు…

మహబూబ్ నగర్

పాలమూరు జిల్లాలో భూతగాదాలతో ఘర్షణ :పరిస్ధితి ఉద్రిక్తం

మహబూబ్‌నగర్‌ : అలంపూర్‌ మండలం జిల్లేడుపాడులో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. భూతగాదాలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జిల్లేడుపాడు గ్రామంలో పోలీసులు భారీగా…

రంగారెడ్డి

కాల్వలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా గండేడ్‌ మండలం మహమ్మదాబాద్‌ వద్ద కాల్వలో పడి ఒకే కుటుంబంలోని తల్లి, కుమారుడు కుమార్తె మృతి చెందారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్పొర్ట్స్

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌ ,221 పరుగుల వద్ద ఔటైన క్రికెట్‌ దేవుడు

ముంబయి : భారత్‌ ,విండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న ముంబయి టెస్ట్‌లో 221 పరుగుల వద్ద భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. సచిన్‌ 74 పరుగులు చేసి జౌటయ్యాడు. దీంతో సచిన్‌ చివరి టెస్ట్‌లో సెంచరీని చేస్తాడని దానిని…

హైదరాబాద్

శంషాబాద్‌లో విమాన రాకపోకలు ఆలస్యం

హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దట్టంగా పొగమంచు వ్యాపించడంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

స్పొర్ట్స్

అర్ధ శతకం సాధించిన పుజారా

ముంబయి : విండీస్‌తో జరుగుతున్న ముంబయి టెస్ట్‌లో పుజారా అర్ధశతకం పూర్తి చేశాడు. 77 బంతుల్లో పుజారా 50 పరుగులు చేశాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 4వ అర్ధశతకం