Wednesday, 4 November 2026

November 2013

ఎడిట్ పేజీ

ముంచడానికే బదలాయింపు డిమాండ్‌

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌ తర్వాత సీమాంధ్రులు ఎక్కువగా కొర్రీలు పెడుతున్నది భద్రాచలంపైన. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావానికి పూర్వం కొంతకాలం ఆంధ్రరాష్ట్రంలో ,అదివరకు ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో ఉందనే కారణం చూపుతూ ఇప్పుడు భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో…

ఎడిట్ పేజీ

పటేల్‌ నూరుపాళ్లు లౌకికవాది

దేశానికి జవహర్‌లాల్‌నెహ్రూ కన్నా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కనుక మొదట ప్రధాన మంత్రి అయి ఉంటే దేశం మరింత పురోగామి దశలో ఉండేదని ఇటీవల గుజరాత్‌ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా…

హైదరాబాద్

మహిళను గాయపరిచి రూ. 14 లక్షల దోపిడీ

హైదరాబాద్‌ : మహిళను గాయపరిచి ఆమె దగ్గరున్న రూ.14 లక్షలను దుండగులు దోచుకెళ్లిన సంఘటన గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో జరిగింది. మహిళ బ్యాంకునుంచి డబ్బు డ్రా చేసుకుని వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. దొంగతనంపై బాధితురాలు బ్యాంకు అధికారులకు…

హైదరాబాద్

స్కూల్‌ ఆఫ్‌ సౌండ్‌ను ప్రారంభించిన చక్రి

హైదరాబాద్‌ : సినీ, టీవీ రంగానికి నిపుణులైన సౌండ్‌ ఇంజినీర్ల అవసరం చాలా ఉందని సినీ సంగీత దర్శకుడు చక్రి అన్నారు. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఆహుజా పంచీ స్కూల్‌ ఆఫ్‌ సౌండ్‌ ఇనిస్టిట్యూట్‌ను చక్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా…

హైదరాబాద్

హైదరాబాద్‌ చేరుకున్న ఉపముఖ్యమంత్రి

ఢిల్లీ : జీవోఎంకు నివేదిక సమర్పిండానికి ఢిల్లీ వెళ్లిన ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన ముగించుకుని బుధవారం మధ్యాహ్నానికి హైదరాబాద్‌ చేరుకున్నారు.

హైదరాబాద్

అఖిల భారత ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

హైదారాబాద్‌ : సికింద్రాబాద్‌లోని మౌలాలీ అర్పీఎఫ్‌ మైదానంలో 62వ అఖిల భారత ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను డీజీపీ ప్రసాదరావు ప్రారంభించారు.

ఖమ్మం

భద్రాచలం డివిజన్‌లో 72 గంటల బంద్‌

భద్రాచలం : తెలంగాణలో అంతర్భాగమైన భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని డిమాండ్‌తో సీమాంధ్ర నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ఈనెల 15,16,17,తేదీల్లో భద్రాచలం డివిజన్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. లక్షలాది ఆదివాసులున్న భద్రాచలం డివిజన్‌ను పోలవరం కట్టేందుకు తెలంగాణ నుంచే…

హైదరాబాద్

రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత కనిష్ట స్థాయికి తగ్గిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుంది. శీతాకాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు క్రమేణా తగ్గుముఖం పడుతుండడంతో చలితో ప్రజలు వణికిపోతున్నారు. గత రెండు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గగా ..హైదరాబాద్‌లో తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో…

సీమాంధ్ర

కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి కిడ్నాప్‌

కర్నూల్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలి కాలంలో చిన్నారుల కిడ్నాప్‌లు ఎక్కువగా జరుగుతూ సంచలనం రేపుతున్నాయి.తాజాగా కర్నూల్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. కిడ్నాప్‌ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. తమకు న్యాయం…

సీమాంధ్ర

కిడ్నాప్‌కు గురైన చిన్నారి ఆచూకి లభ్యం

విజయవాడ : నగరంలోని రామలింగేశ్వర్‌నగర్‌ ఆరోలైన్‌లో కిడ్నాప్‌కు గురైన శివానాగనందిని అనే బాలిక బాలిక ఆచూకి లభ్యమైంది. శివనాగనందిని ప్రస్తుతం ఆరో తరగతికి చదువుతుంది. ప్రస్తుతం ఈ బాలిక క్షేమంగానే ఉన్నట్లు ఆమె తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు.