Tuesday, 3 November 2026

November 2013

జాతీయం

యూపీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఢిల్లీ విద్యార్థినిపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్పొర్ట్స్

ఈడెన్‌లో నిరాశపర్చిన సచిన్‌ , 10 పరుగల వద్ద ఔట్‌

కోల్‌కతా : భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగుతున్న తొలిటెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 82 పరుగుల వద్ద సచిన్‌ (10) ఔటయ్యాడు. విండీస్‌ బౌలర్‌ షిల్లింగ్‌ ఫోర్డ్‌ మూడు వికెట్లు తీసి సత్తా…

కరీంనగర్

ఎన్టీపీసీలో ఆవిర్భావ వేడుకలు ప్రారంభం

కరీంనగర్‌ : ఎన్టీపీసీ విద్యుత్‌ సంస్థ 39వ ఆవిర్భావ వేడులు జి.ఎం సుభాషన్‌ఘోష్‌ ప్రారంభించారు.పర్మినెంట్‌ టౌన్‌షిప్‌లో ఉద్యోగులు ,అధికారులు మార్నింగ్‌ వాక్‌ చేశారు. అనంతరం ఎన్టీపీసీ ప్లాంట్‌లోని మేడే పార్కులో ఉద్యోగులను ఉద్దేశించి జీఎం ప్రసంగించారు.

హైదరాబాద్

టీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా ఇన్‌చార్జీగా జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌ : నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా పొలిట్‌బ్యూరో సభ్యుడు గుంటండ్ల జగదీశ్‌రెడ్డిని నియమిస్తూ కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జగదీశ్‌రెడ్డి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ,అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు.

హైదరాబాద్

ఎయిర్‌పోర్టులో కిలో బంగారం పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కిలో బంగారంను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. సురేష్‌కుమార్‌ అనే వ్యక్తి నుంచి ఈ బంగారం స్వాదీనం చేసుకున్నారు.

హైదరాబాద్

బంగాళఖాతంలో మరో అల్పపీడనం : ఈ నెల 9న వాయుగుండంగా మారే అవకాశం

హైదరాబాద్‌ : బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.ఈ నెల 9వ తేదిలోగా ఇది వాయుగుండంగా మారవచ్చని ఆ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్‌ నికోబార్‌ దీవుల సమీపంలో ఏర్పడుతున్న ఈ అల్పపీడనం బలపడితే రాష్ట్రవ్యాప్తంగా భారీ…

జాతీయం

నేడు జీవోఎం మూడో సమావేశం

ఢిల్లీ : ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ మూడో సమావేశం జరగనుంది. కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రతిపాదించిన నివేదికలు ,రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఈ సమావేశంలో మంత్రుల కమిటీ సమీక్షించనుంది.

రంగారెడ్డి

గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

రంగారెడ్డి : జిల్లాలోని కుల్కచర్ల మండలం బండేలికిచర్ల గ్రామ సమీపంలో గుర్తు తెలియని మహిళను మతమార్చి దహనం చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్

30 ప్రైవేట్‌ బస్సులను సీజ్‌ చేసిన ఆర్టీఏ అధికారులు

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై రవాణాశాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. గురువారం నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న 30 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.హైదరాబాద్‌లో 11, విజయవాడలో 5, ఒంగోలులో ,చిత్తూరులో…