Monday, 2 November 2026

November 2013

జాతీయం

రాహుల్‌గాంధీకి ఎన్నికల కమిషన్‌ నోటీస్‌

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎన్నికల కమిషన్‌ నోటీస్‌ జారీ చేసింది. బీజేపీ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. ముజఫర్‌నగర్‌లో ఐఎస్‌ఐ తీవ్రవాదాన్ని పెంచుతుందన్న రాహుల్‌ వ్యాఖ్యలపై ఈసీ వివరణ కోరింది.

నల్లగొండ

చంద్రబాబుకు తెలంగాణ సెగ : నల్లజెండాలతో నిరసన తెలిపిన ప్రజలు

నల్లగొండ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాలోని దామరచర్లకు చేరుకున్నారు. చంద్రబాబుకు తెలంగాణవాదులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. తెలంగాణ వాదులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. పోలీసుల దాడిలో ఇద్దరు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా…

జాతీయం

తిరస్కరణ ఓటు గుర్తు సిద్దం

న్యూఢిల్లీ : ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా తిరస్కరణ ఓటు ప్రవేశపెట్టబోతున్న భారత ఎన్నికల కమిషన్‌ అందుకు సంబంధించిన గుర్తును సిద్దం చేసింది. ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం) లో దీర్ఘచతురస్రాకారంలో ఉండే బాక్స్‌లో ‘నోటా’ అని రాసి ఉన్న గుర్తును చేర్చనున్నారు.…

సీమాంధ్ర

తిరుమల వెంకన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎల్‌. నరసింహారెడ్డి ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు.

నల్లగొండ

డివైడర్‌ను ఢీకోని ఆర్టీసీ బస్సు బోల్తా :పలువురికి గాయాలు

నల్లగొండ : కొయ్యగూడెం -చౌటుప్పల్‌ మధ్య డివైడర్‌ను ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. బస్సు హైదరాబాద్‌ నుంచి నల్లగొండ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

ప్లాస్టిక్‌ గోదాంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : సాగర్‌ రింగ్‌రోడ్డులోని ఓ ప్లాస్టిక్‌ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ,స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు.

నల్లగొండ

మహిళ గొంతుకోసి పరారైన దుండగుడు

నల్లగొండ : జిల్లాలోని సూర్యపేట భగత్‌సింగ్‌ నగర్‌లో దుండగుడు బ్లేడుతో మహిళ గొంతుకోసి పరారయ్యాడు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడి కోసం వెతుకుతున్నారు.

హైదరాబాద్

ఎనిమిది పార్టీలకు హోం శాఖ లేఖలు

హైదరాబాద్‌ : విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం విధి విధానాలపై అభిప్రాయాలను ఐదవ తేదిలోపు చెప్పాలని కోరుతూ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీలకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌ సురేష్‌కుమార్‌ లేఖలు రాశారు. కాంగ్రెస్‌…

హైదరాబాద్

నేడు తెలంగాణ విద్రోహదినం : బ్లాక్‌ డే పాటిస్తున్న తెలంగాణ ప్రజలు

హైదరాబాద్‌ : తెలంగాణను సీమాంధ్రతో కలిపిన నవంబర్‌ ఒకటో తేదిన బ్లాక్‌ డేగా పాటించాలని తెలంగాణ జేఏసీ ,తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించాయి. తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. తెలంగాణ జిల్లాల్లో అమరవీరుల స్ధూపాల…