Wednesday, 4 November 2026

February 2014

వార్తలు

ఢిల్లీ వేదికగా కుట్రలకు సీమాంధ్ర నేతల స్కెచ్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ వేదికగా కుట్రలకు సీమాంధ్ర నేతలు స్కెచ్‌ గీస్తున్నారు. 17,18 తేదీల్లో ఢిల్లీలో కల్లోలం చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఏపీ నుంచి జనాన్ని తరలించేందుకు పక్కా వ్యూహం పన్నుతున్నారు. టీ బిల్లును అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రలు…

వార్తలు

ప్రజాస్వామ్యం పరువు తీశారు : పొంగులేటి

హైదరాబాద్‌ : సీమాంధ్ర పార్లమెంట్‌ సభ్యులు పార్లమెంట్‌ పరువు తీశారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో సీమాంధ్ర నేతలు, తోటి ఎంపీలపై, స్పీకర్‌పై దాడులు చేయటం అమానుషమన్నారు. పార్లమెంట్‌లో ప్రాణరక్షణ ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ…

వార్తలు

పార్లమెంట్‌కు దుర్దినం : జాతీయ మీడియా

న్యూఢిల్లీ : ఓ పార్లమెంట్‌ సభ్యుడు పార్లమెంట్‌లో పెప్పర్‌ స్ప్రే చేయటం అబులెన్స్‌ పిలవడం, ఎంపీలు ఆసుపత్రి పాలు కావడం నిజంగా ఇది పార్లమెంట్‌కు దుర్దినమని సీఎన్‌ఎన్‌, ఐబీఎన్‌ చీఫ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయి అన్నారు. 20 ఏళ్లుగా…

వార్తలు

ఢిల్లీలో మూడు చోట్ల సిలిండర్లు పేలుడు

ఢిల్లీ : ఢిల్లీలో మూడు చోట్ల సిలిండర్లు పేలిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.

వార్తలు

నీటి గుంటలో పడి విద్యార్ధులు మృతి

రంగారెడ్డి : జిల్లాలోని కొంపల్లి జయభేరి కాలనీలో నీటి గుంటలో పడి ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. మృతులను నిఖిల్‌, ఇంద్రజిత్‌, శ్రావణ్‌లుగా గుర్తించారు. నిన్న స్కూల్‌కు వెళ్లి తిరిగిరాని విద్యార్ధులు ఈ రోజు శవాలుగా తేలారు.

వార్తలు

అరుణ్‌జైట్లీని కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు

ఢిల్లీ : అరుణ్‌జైట్లీని తెలంగాణ బీజేపీ నేతలు కలిశారు. తెలంగాణకు పూర్తిస్థాయిలో మద్దతిస్తామని అరుణ్‌జైట్లీ మాకు హామీ ఇచ్చారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ విషయంలో బీజేపీని అనుమానించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

వార్తలు

పార్లమెంట్‌ విలువలు దిగజార్చారు : వీహెచ్‌

న్యూఢిల్లీ : బ్యాంకులను ముంచి రాజకీయాల్లోకి వచ్చిన లగడపాటి పార్లమెంట్‌ విలువలు దిగజార్చారని రాజ్యసభ సభ్యులు వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భగత్‌సింగ్‌తో లగడపాటిని పోల్చడం అవమానమన్నారు. లగడపాటిపై జీవితకాలం నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు.

వార్తలు

ఎస్సై రంగనాథ్‌గౌడ్‌ను సర్వీస్‌ నుంచి తొలగింపు

గుంటూరు : రజియా సుల్తానా కేసులో ఎస్సై రంగనాథ్‌గౌడ్‌ను సర్వీస్‌ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. గుంటూరు రేంజ్‌ ఐజీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

వార్తలు

లగడపాటిపై పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు

హైదరాబాద్‌ : లగడపాటిని అభినవ భగత్‌సింగ్‌గా పోలుస్తూ వచ్చిన ప్రకటనలపై మల్కాజిగిరి కోర్టులో న్యాయవాది సంజయ్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. 150ఎ, 153ఎ, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈనెల…

వార్తలు

సీమాంధ్ర ఎంపీల తీర్మానం దుర్మార్గం : గండ్ర

వరంగల్‌ : సీమాంధ్ర ఎంపీల పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు దుర్మార్గమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. తెలంగాణను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని తెలిపారు.