Tuesday, 3 November 2026

February 2014

వార్తలు

పాల్వంచలో స్వల్ప భూకంపం

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా పాల్వంచలో స్వల్ప భూకంపం సంభవించింది. పాల్వంచలోని పాలకేంద్రం వద్ద స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.

వార్తలు

రాత్రి 7గంటలకు జీవోఎం మరోసారి భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీవోఎం మరోసారి భేటీకానుంది. ఇవాళ రాత్రి 7గంటలకు మంత్రుల బృందం సమావేశమై తెలంగాణ బిల్లుపై చర్చించనుంది.

వార్తలు

రాష్ట్రపతిని కలిసిన సీఎం కిరణ్‌

న్యూఢిల్లీ: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రపతిని కలిశారు. ఇవాళ ఆయన తన దీక్షను ముగించుకుని నేరుగా రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరారు. సీఎంతో పాటు సీమాంధ్రులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌-చత్తీస్‌గఢ్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

జాతీయం

ముగిసిన సీఎం కిరణ్‌ దీక్ష

ఢిల్లీ : జంతర్‌మంతర్‌ వద్ద సీఎం కిరణ్‌ చేపట్టిన మౌన దీక్షను విరమించారు. అనంతరం ఆయన జంతర్‌మంతర్‌ నుంచి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దగ్గరకు బయలుదేరారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన దీక్షకు దిగిన విషయం తెలిసిందే.

వార్తలు

బాగ్దాద్‌లో బాంబు పేలుళ్లు : 13 మంది మృతి

హైదరాబాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ నగరంలో వరుస బాంబు పేలుళ్లలో 13 మంది మృతి చెందారు. బాగ్దాద్‌ నగరంలో కీలక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న గ్రీన్‌విచ్‌ ప్రాంతంలో ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి.

తెలంగాణ

తెలంగాణ బిల్లుపై కుట్రలు పనికి రావు : డిప్యూటీ సీఎం రాజనర్సింహ

న్యూఢిల్లీ: ఎవరెన్ని కుట్రలు చేసిన తెలంగాణ ఆగదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. సీఎం కిరణ్‌కు నైతిక విలువలు ఉంటే పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. సీఎం వ్యవహార శైలి తెలంగాణ ప్రజలను కించపర్చేలా ఉందని తెలిపారు. సీఎం…

వార్తలు

రేపు కేంద్ర కేబినేట్‌ భేటీ, టీ బిల్లుపై చర్చ

ఢిల్లీ: రేపు కేంద్రకేబినేట్‌ భేటీ కానుంది. ఈభేటీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై చర్చించనున్నారు. సమావేశంలోనే టీ బిల్లుకు కేబినేట్‌ ఆమోదం తెలపసున్నట్లు సమాచారం. కేబినేట్‌ ఆమోదం తర్వాతే టీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే…

అంతర్జాతీయం

అమెరికా సర్జన్‌ జనరల్గఆ కన్నడ డాక్టర్‌ వివేక్‌ మూర్తి

అమెరికా  :అమెరికా సర్జన్‌ జనరల్గఆ కన్నడ డాక్టర్‌ వివేక్‌ మూర్తి సర్జన్‌ జనరల్గఆ కర్ణాటకకు చెందిన డాక్టర్‌ వివేక్‌ మెచ్‌ మూర్తి (36) నియమింతులయ్యారు. ప్రతిష్ఠాత్మక సాప్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సీ ఈఓగా తెలుగు తేజం సత్యనాదెళ్ల ఎంపికయిన…

వార్తలు

రాజ్యసభ సమావేశంలో మతహింస నిరోధక బిల్లుపై చర్చ

ఢిల్లీ : వాయిదా అనంతరం రాజ్యసభ సమావేశం ప్రారంభమైంది. మతహింస నిరోధక బిల్లుపై చర్చ కొనసాగుతోంది. మతహింస నిరోధక బిల్లును భాజపా వ్యతిరేకిస్తోంది. శాంతిభద్రతలు కేవలం రాష్ట్రానికి సంబంధించినవని, కేంద్రం పరిధిలోనివి కావని భాజపా నేత అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు.…