Thursday, 5 November 2026

March 2015

సీమాంధ్ర

మూడేళ్ల చిన్నారిని హత్య చేసిన తండ్రి

హైదరాబాద్‌: అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కదిరేపల్లిలో ఈ దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిని కన్న తండ్రే హత్యచేయగా గ్రామస్థులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

కరీంనగర్

కుమారుడితో సహా దంపతుల ఆత్మహత్యాయత్నం

కరీంనగర్: జిల్లాలోని గోదావరిఖని సంతోష్‌నగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు కుమారుడితో సహా ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్

ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ దాడి

హైదరాబాద్‌: నగరంలోని అంబర్‌పేట ా’ా నంబర్‌ కూడలి వద్ద ఆర్టీసీ బస్సులో ఘర్షణ చోటు చేసుకుంది. సిగ్నల్‌ వద్ద బస్సు ఆపాలంటూ ఓ ప్రయాణికురాలు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో వాదనకు దిగింది. అందుకు ఆగ్రహించిన బస్సు డ్రైవర్‌ మహిళా…

జాతీయం

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 209 పాయింట్లు నష్టపోయి 28,261 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 8,571 వద్ద స్థిరపడ్డాయి. విప్రో, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, కెయిర్న్‌ ఇండియా, అంబుజా…

హైదరాబాద్

ఈనెల 26 నుంచి ఏప్రిల్‌ 11 వరకూ పదో తరగతి పరీక్షలు

హైదరాబాద్‌, (మార్చి 20): ఈనెల 26 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 11 వరకూ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి…

Featured News

పాక్ పరాజయం; భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సెమీస్

అడిలైడ్ (మార్చి 20): పాకిస్తాన్‌తో ఇక్కడ జరిగిన ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఫలితంతో భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య ఒక సెమీఫైనల్ మ్యాచ్ ఖాయమైంది. నేటి…

సీమాంధ్ర

కారంచేడు ఆలయంలో అపశ్రుతి

ప్రకాశం, మార్చి 20: ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన భక్తి కార్యక్రమాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామ్రాజ్యం(57) అనే భక్తురాలు మరణించారు. ఈ సంఘటనతో ఆలయంలో భక్తులు విషాదంలో మునిగిపోయారు.

సీమాంధ్ర

స్పీకర్‌ స్థానానికి వన్నె తెస్తా : కోడెల శివప్రసాద్‌

హైదరాబాద్‌, (మార్చి20): నాకంటే ముందు ఎంతోమంది మహనీయులు స్పీకర్‌ స్థానంలో పని చేశారు.స్పీకర్లుగా హుందాగా వ్యవహరించి ఆ స్థానానికే గౌరవం తీసుకు వచ్చారని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అన్నారు. తాను కూడా వారి బాటలోనే నడిచి ఆ పదవికి…

సీమాంధ్ర

చిన్నారిని చంపిన తండ్రి

అనంతపురం, (మార్చి20): కన్నకూతురునే కర్కశంగా చంపేశాడో తండ్రి. పాశవికమైన ఈ ఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కదిరేపల్లిలో జరిగింది. మూడేళ్ల కూతురుని తండ్రే చంపేశాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు దుండుగుడికి దేహశుద్ధి చేశారు. కూతుర్ని హత్య చేసిన…

సీమాంధ్ర

యువకుడి దారుణహత్య

కృష్ణా (మార్చి20): కృష్ణా జిల్లాలో ఒక యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. పడన మండలం కొంకేపూడిలో రాధాకృష్ణ అనే యువకుడిని ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. రాధాకృష్ణ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రాధాకృష్ణ హత్యపై కేసు నమోదు…