Wednesday, 4 November 2026

September 2015

సీమాంధ్ర

విజయవాడలో కుక్కలు స్వైరవిహారం

విజయవాడ : రాష్ట్రంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. సర్కార్‌ వైఫల్యం వల్లే గ్రామ సింహాలు రెచ్చిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెజవాడలో కుక్కల దాడితో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.ప్రతి వీధిలో, ప్రధాన సెంటర్లలో జనంపై కుక్కలు దాడి చేస్తున్నాయి. పాదాచారులకు…

సీమాంధ్ర

అశ్లీల నృత్యాలను అడ్డుకున్న పోలీసులపై గ్రామస్థుల దాడి

ప్రకాశం : సింగరాయకొండ మండలం పాకలపల్లెపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అశ్లీల నృత్యాలను అడ్డుకున్నందుకు పోలీసులపైనే గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో హోంగార్డుకు గాయాలయ్యాయి. ఈ సంఘటనలో వాహనం ధ్వంసం అయింది. అదనపు పోలీసు బలగాలతో…

సీమాంధ్ర

హెల్మెట్‌తో దాడి

తూర్పుగోదావరి, సెప్టెంబరు 21 : కాకినాడలోని సీబీసీఎన్సీ స్కూలు ఘర్షణ జరిగింది. నలుగురు ఉపాధ్యాయులపై ఓ మహిళా టీచర్‌ భర్త, కుమారుడు హెల్మెట్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. స్కూలుకు…

మహబూబ్ నగర్

ఎమ్మెల్యే రేవంత్‌ సోదరుడు గుండెపోటుతో మృతి

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 21 : కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి గుండెపోటుతో మరణించారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనతో రేవంత్‌ అనుచరులు తరలివచ్చారు.

సీమాంధ్ర

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాల సేకరణ

విశాఖ, సెప్టెంబరు 21 : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 23వ తేదీన ఏయూలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణను ఆరంభించనున్నట్లు విశాఖ నగర కాంగ్రెస్‌ నేత భాస్కర్‌రావు చెప్పారు. ఈ సంతకాల సేకరణ…

సీమాంధ్ర

టీడీపీ కార్యకర్త మృతి

 కర్నూలు, సెప్టెంబరు 21 : ప్యాపిలి మండలం మునిమాడుగుల గ్రామంలో పశువుల విషయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని డోన్‌…

హైదరాబాద్

గణేష్‌ మండపంలో నాగుపాము

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 : నగరంలోని ల్యాంకోహిల్స్‌ సమీపంలోని ఖాజాగూడలో గణేష్‌ మండపంలోకి ఓ నాగుపాము వచ్చింది. కైలాసం నుంచి ఖాజాగూడకు పాము వచ్చిందని భక్తులు పెద్ద ఎత్తున చేరి రాత్రి నుంచి నాగుపాముకు పూజలు చేశారు. ఆ…

సీమాంధ్ర

ఏనుగుల బీభత్సం

 చిత్తూరు, సెప్టెంబరు 21 : చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నూనేవారిపల్లెలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంటపొలాలు సహాల తోటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్

పెరిగిపోతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ ఆగడాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 : నగరంలో ప్రైవేటు ట్రావెల్స్‌ ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎల్బీనగర్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నా బస్సు రాలేదు. నాలుగు గంటల తర్వాత యాజమాన్యాన్ని ప్రయాణికులు ప్రశ్నించారు. బస్సు వెళ్లి పోయిందని యాజమాన్యం చెప్పడంతో ఆగ్రహించిన ప్రయాణికులు…

సీమాంధ్ర

ఒడిసా వద్ద అల్పపీడనం

విశాఖపట్నం, సెప్టెంబరు 21: ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిసా, పశ్చిమమధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఉత్తర ఒడిసా, పశ్చిమబెంగాల్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో విస్తారంగా,…