Wednesday, 4 November 2026

September 2015

సీమాంధ్ర

హాస్టల్‌లో పీడీ కొడుతున్నారని ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్థులు

విశాఖ, సెప్టెంబరు 9 : పెదబయలు ఎస్టీ హాస్టల్‌లో ఫిజికల్‌ డైరెక్టరు కొడుతున్నారని 300 మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. హాస్టల్‌లోని బ్లాక్‌బోర్డుపై రాసిన విద్యార్థులు హాస్టల్‌ వదిలి వెళ్లారు. ఈ ఘటనపై ఎస్టీ శాఖాధికారులు దర్యాప్తు చేస్తామన్నారు.

హైదరాబాద్

గాంధీ ఆసుపత్రిలో మరో మహిళకు స్వైన్‌ఫ్లూ

 హైదరాబాద్‌, సెప్టెంబరు 9 : గాంధీ ఆసుపత్రిలో మరో మహిళ స్వైన్‌ఫ్లూతో చేరింది. మెదక్‌ జిల్లాకు చెందిన గర్భిణి మరియమ్మకు స్వైన్‌ఫ్లూ అని వైద్యులు నిర్ధారించారు. దీంతో మరియమ్మను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. మరో ఇద్దరు…

సీమాంధ్ర

కుటుంబకలహాలతో ఆరునెలల గర్భిణి ఆత్మహత్య

కర్నూలు, సెప్టెంబరు 9 : కోడుమూరు మండలం తంబుకనగర్‌లో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో ఆరు నెలల గర్భిణి రుక్సానా ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తంబుకనగర్‌లో సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్

నేడు హైదరాబాద్‌ రానున్న రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 : హైకోర్టు ఆంక్షలు సడలించిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌ రానున్నారు. నగరానికి వస్తున్న రేవంత్‌రెడ్డికి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నేతలు పోలీసు అకాడమీ వద్ద ఘనస్వాగతం పలకనున్నారు. అనంతరం ఎల్బీనగర్‌లో…

సీమాంధ్ర

పోలీసుల వైఖరిపై నీళ్లట్యాంకుపైకి ఎక్కి నిరసన

పశ్చిమగోదావరి, సెప్టెంబరు 9 : నల్లజర్ల మండలం సింగరాజుపాలెంలో తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రాజేంద్రప్రసాద్‌ అనే వ్యక్తి నీళ్లట్యాంకు పైకి నిరసన తెలిపారు. నీళ్లట్యాంకు పైకి ఎక్కిన రాజేంద్రప్రసాద్‌ను…

మహబూబ్ నగర్

జూరాలకు పెరుగుతున్న వరద ఉధృతి

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 9 : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరదనీటి ఉధృతి పెరిగింది. 10,448 క్యూసెక్కుల నీరు చేరడంతో జూరాల నీటిమట్టం 317.35 అడుగులకు పెరిగింది. జూరాల పూర్తి…

Featured News

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు బోల్తా పడి మాజీ ఎంపీపీ మృతి

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 : పెద్దఅంబర్‌పేట ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు బోల్తా పడిన సంఘటనలో ఘట్‌కేసర్‌ మాజీ ఎంపీపీ యాటకుమార్‌ మృతి చెందారు. ఈ సంఘటనలో మేడ్చల్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తోటకూర జంగయ్యయాదవ్‌, మీసాల కృష్ణలకు గాయాలయ్యాయి.…

రంగారెడ్డి

శామీర్‌పేట్‌ ఎస్‌బీహెచ్‌లో చోరీకి దొంగల యత్నం

రంగారెడ్డి, సెప్టెంబరు 9 : శామీర్‌పేట్‌లోని స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ హైదరాబాద్‌లో గుర్తుతెలియని దొంగలు చోరీకి యత్నించారు. గత రాత్రి గ్యాస్ కట్టర్‌తో బ్యాంకు వెనుకభాగం నుంచి లోపలకు చొరబడేందుకు దుండుగులు ప్రయత్నించారు. అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం…

సీమాంధ్ర

విజయవాడ రహదారిపై ప్రమాదంలో 15 మందికి గాయాలు

కృష్ణా, సెప్టెంబరు 9 : విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నవాబ్‌పేట్‌ దగ్గర ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడి న…

జాతీయం

తల్లి ప్రియుడే వారి పాలిట కాలయయుడిలామారాడు.

తల్లి పెట్టుకున్న వివాహేతర సంబంధం ఆ పిల్లల పాలిట శాపంగా మారింది. తల్లి ప్రియుడే వారి పాలిట కాలయయుడిలా మారాడు. ముగ్గురు పిల్లల్ని ఏమాత్రం కనికరం లేకుండా డ్రైనేజీ మ్యాన్ హోల్ తోసి చంపేశాడు. ఊపిరాడని ఆ పిల్లలు…