Wednesday, 4 November 2026

October 2015

జాతీయం

సుకుమా జిల్లాలో కాల్పులు.

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో గురువారం ఉదయం పోలీసులకు – మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.

ఖమ్మం

ఖమ్మంలో ఒప్పంద పారిశుధ్య కార్మికుల ఆందోళన..

ఖమ్మం : జిల్లాలో ఒప్పంద పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. గుత్తేదారు వేధిస్తున్నారంటూ నగర పాలక సంస్థ భవనంపైకి ఎక్కి కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Featured News

బీహార్ నాలుగు ర్యాలీలో ప్రసంగించనున్న మోడీ.

ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజంతా బీహార్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగించనున్నారు. ముందుగా ముంగేర్ ప్రచార సభలో పాల్గొననున్న ప్రధాని.. అనంతరం సమస్తీపూర్, బెగూసరాయ్, నవాదా బహిరంగ సభలకు హాజరుకానున్నారు. ప్రధాని…

సీమాంధ్ర

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటలు..నడకదారి భక్తుల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.

Featured News

నేడు టీఆర్ఎస్ఎల్సీ సమావేశం

టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఈరోజు తెలంగాణ భవన్ లో జరుగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్…

మహబూబ్ నగర్

కొండారు శివారులో కారు బోల్తా: ఐదుగురికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా ఇటిక్యాల మండలం కొండారు శివారులో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నల్లగొండ

బస్సు కిందపడి మహిళ మృతి

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో బస్సు కిందపడి మహిళ మృతి చెందింది. బస్సు దిగుతుండగా వెనుక చక్రాల కిందపడి మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.