Saturday, 7 November 2026

July 2022

జిల్లా వార్తలు

పినపాక నియోజకవర్గం జూలై 17 (జనం సాక్షి): రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలతో ముంపుకు గురైనా భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలోని పునరావస బాదితులను రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఆదివారం పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులను పరామర్శించారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గవర్నర్ మణుగూరు మండలం రైల్వే స్టేషన్ లో దిగారు. స్థానిక అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు అక్కడి నుంచి అశ్వాపురం మండలంలోని ఎస్కేటి ఫంక్షన్ హాల్లో నిర్వాసితులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ రెడ్ క్రాస్ సొసైటీ కాంతారావు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వాసితులకు నిత్యవసర సరుకులు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాత్కాలికంగా సరుకులు భోజనాలు మందులు ఏర్పాటు చేశారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ముఖ్యమంత్రి బాధితులతో మాట్లాడలేదని ధర్నా: అశ్వాపురం మండలంలో రహదారి పై నిర్వాసితులు ధర్నాకు దిగారు. ఆదివారం ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా అశ్వాపురం మండలంలో ముంపుకు గురైన ఐదు మండలాల నిర్వసితులను పరామర్శించకుండా వెళ్లారని రహదారిపై ధర్నాకు దిగారు. మా గోడును వారికి చెబుతామనుకుంటే వారికి మొండి చేయి ఎదురైంది.. అశ్వాపురం మండలంలో ఐదు గ్రామాలలో 15 వేల మందికి పైగా జీవిస్తున్నారు. వారికి ప్రాణనష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఎక్కడ వస్తువులను అక్కడే వదిలి కట్టుబట్టలతో పునరావస కేంద్రాలకు తరలించారు. అప్పటినుంచి అధికారులు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన బట్టలతో మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము మాకు అధికారులు గానీ ప్రజాప్రతినిదులు కానీ రాలేదు.మాకు కట్టుకోవడానికి బట్టలు దుప్పట్లు లేక అవస్థలు పడుతున్నాం. చిన్నపిల్లలు దగ్గు జ్వరం వచ్చి అనారోగ్యం పాలై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి మందులు ఇవ్వడానికి ఎవరు అందుబాటులో లేకపోవడం బాధాకరమని అన్నారు. కనీసం మా గోడును ముఖ్యమంత్రితో చెప్పుకుందామనుకుంటే ఆగకుండా వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షిణమే మాకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లని నష్టపోయిన పంట పొలాలకు పాడైపోయిన ఇండ్లకు వస్తువులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

మిర్యాలగూడ. జనం సాక్షి  మహిళల అభ్యున్నతికి సిపిఐ కృషి చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు అన్నారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం యాద్గార్ పల్లి గ్రామంలో సభ్యత్వ నమోదు చేపట్టారు ఈ సందర్భంగా…

ఖమ్మం

అశ్వాపురం మండలంలో పర్యటించిన గవర్నర్ తమిళ సై

పినపాక నియోజకవర్గం జూలై 17 (జనం సాక్షి): రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలతో ముంపుకు గురైనా  భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలోని పునరావస  బాదితులను రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఆదివారం పునరావాస కేంద్రాలలో ఉన్న…

జిల్లా వార్తలు

*దేశవ్యాప్త ప్లాంటేషన్ డ్రైవ్ను నిర్వహించడానికి ‘ఆజాదీ కా అమృత్ మోహత్సవ్’NHAIని జరుపుకుంటున్నారు*

బాల్కొండ,  17 జూలై (జనం సాక్షి) ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఆధ్వర్యంలో, 2022 జూలై 17న దేశవ్యాప్తంగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించాలని NHAI నిర్ణయించింది. దేశవ్యాప్తంగా దాదాపు లక్ష మొక్కలు నాటేందుకు ప్రయత్నించడం దీని లక్ష్యం. ఇందులో…

ఖమ్మం

అశ్వాపురం మండలంలో పర్యటించిన గవర్నర్ తమిళసై

పినపాక నియోజకవర్గం జూలై 17 (జనం సాక్షి): రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలతో ముంపుకు గురైనా భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలోని పునరావస బాదితులను రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఆదివారం పునరావాస కేంద్రాలలో ఉన్న…

ఖమ్మం

జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఛానల్ యాజమాన్యం అన్ని విధాలా ఆదుకోవాలి

 ! టీయూడబ్ల్యూజే  (ఐ  జే యూ) జిల్లా ఉపాధ్యక్షులు బూర రమేష్ గౌడ్ కార్యవర్గ సభ్యులు ఏ గోళం రవీందర్ గౌడ్ m గణపురం (ము) జూలై 17) జనం సాక్షి) : జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం 10టీవీ…

ఖమ్మం

ట్యాంకర్లతో నీటిని అందిస్తున్న పంచాయతీ

చండ్రుగొండ జనంసాక్షి (జులై  17) : మండల కేంద్రమైన చండ్రుగొండలో  గత వారం రోజులుగా  భగీరథ నీరు రాకపోవడంతో  పంచాయితీ ప్రజల సమస్యలను  వారు పడే ఇబ్బందులను జనంసాక్షి  గుర్తించింది. ” భగీరథ  నీళ్ల అంతరాయం మాట సరే…

జిల్లా వార్తలు

. శ్రీ లక్ష్మీనరసింహస్వామి నీ దర్శించుకున్న ఇప్ప శ్రీనివాస్.

జనం సాక్షి..మాచారెడ్డి మండలంలోని అడవి ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని ఆదివారం రోజున తేజస్వి ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి ఆదివారం రోజున శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నాడు.…

జిల్లా వార్తలు

వేలుబెల్లి చెరువులో మత్స్యకారుల జాలకు చిక్కిన కొండచిలువ

జూలై 17 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని వేలుబెల్లి గ్రామం చెరువు లో చేప పిల్లలు చెరువు నుండి బయటకు వెళ్లకుండా ఏర్పాటు చేసినటువంటి(ఇనుప జాల)వల లో చిక్కిన భారీ కొండచిలువ భయాందోళనలో గ్రామ ప్రజలు,మత్స్యకారులు తక్షణమే అటవీ…

తెలంగాణ

వ్యవసాయ బోరు నుండి పైకి ఉబికి వస్తున్న నీరు…

బయ్యారం,జులై17(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లింగగిరి గ్రామంలో వ్యవసాయ బోరుబావి నుండి పైపుల ద్వారా నీరు పైకి ఉబికి వస్తుంది. వర్స నర్సయ్య, పూనెం బిక్షం అనే ఇద్దరు రైతుల పొలంలోని బోరు బావి పైపులనుండి ఆదివారం…

కరీంనగర్

గొల్లవాడ లో భరించలేని మురికి కంపు అంటువ్యాధులు వచ్చే అవకాశం

మహాదేవపూర్ జులై17 (జనంసాక్షి) మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతమైన గోల్లవాడలో భరించలేని మురికి కంపు ఏర్పడింది వర్షాకాలంలో ఇలాంటి అశుభ్రత వల్ల ఈ ప్రాంత ప్రజలకు అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముందు చూపు లేక లోతట్టు ప్రాంతంలో…