విశాఖపట్నం,(జనంసాక్షి): రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఆదివారం వెల్లడించింది. వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం స్థిరంగా ఉందని పేర్కొంది. ఆ ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడవచ్చని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.




