Tuesday, 3 November 2026

రాష్ట్రంలో 24గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది

విశాఖ: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌ఘడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింత బలపడింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటలకు 45 నుండి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *