Tuesday, 3 November 2026

గుంటూరులో ఎక్సైజ్‌ కార్యాలయం ముట్టడి

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న కొత్త ఎక్సైజ్‌ విధానానికి వ్యతిరేకంగా గుంటూరు జిల్లా ఎక్సైజ్‌ కార్యాలయం వద్ద తెదేపా, సీపీఐ, లోక్‌సత్తా పార్టీలు వేర్వేరుగా అందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఉదయం పదిన్నర గంటల నుంచి ఒక్కో పార్టీ ఒక్కో సమయంలో వేర్వేరుగా నిరసనలు చేపట్టాయి. పర్మిట్‌ రూమ్‌లు, కొత్త దుకాణాలకు అనుమతులు, మద్యం విధానంపై ఆయా పార్టీల నాయకులు మండిపడ్డారు. తొలుత ప్రదర్శనగా ఎక్సైజ్‌ ఉప కమిషనర్‌ కార్యాలయానికి ప్రదర్శనగా చేరుకుని రోడ్డుపై బైఠాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *