పెళ్లకూరు, (జనంసాక్షి): నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలో నామినేషన్ కేంద్రం వద్ద వైకాప అభ్యర్థి రాజారెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు పత్రాలను దౌర్జన్యంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో కేంద్రం వద్ద పోలీసులు లేకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యువకులు అధికార కాంగ్రెస్‌కు చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.




