Tuesday, 3 November 2026

విద్య, వైద్య కార్పోరేట్‌ రంగాలుగా మారడం శోచనీయం: నారాయణ

తిరుపతి,(జనంసాక్షి): సమాజంలో విద్య వైద్య రంగాలు కార్పోరేట్‌ రంగాలుగా మారడం శోచనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సదస్సు తిరుపతిలో జరిగింది. వివిధ రంగాలకు చెందిన నిపుణులతో పాటు రాష్ట్ర నుంచి ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ వైద్యుల నిష్పత్తి తక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. వైద్య, విద్య పూర్తిగా కార్పొరేట్‌ రంగంగా మారడం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *