సున్నిపెంట (కర్నూలు): శ్రీశైలం-సున్నిపెంట మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీశైలం నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జయరావు (43) ఘటనాస్థలంలోనే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రుల్ని పోలీసులు చికిత్స నిమిత్తం ప్రాజెక్టు ఆసుపత్రిని తరలించారు. బాధితులంతా హైదరాబాద్ డిఫెన్స్ కాలనీకి చెందినవారుగా గుర్తించారు. ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.




