విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం మండలం మూలపాడులో తెదేపా కార్యకర్తలకు మద్దతుగా పోలింగ్ కేంద్రం వద్ద ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూలపాడులో ఓకే ఇంటి చిరునామాతో ఉన్న 250 ఓట్లను తొలగించి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. భారీగా మోహరించిన పోలీసుల బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన స్థానికేతరులపై కూడా గ్రామస్థుల దాడులు కొనసాగుతున్నాయి.




