నేడు, విశాఖపట్నం: రాష్ట్రంలోని కోస్తా, తెలంగాణ జిల్లాల్లో సోమవారం రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, రాయలసీమలో చిరుజల్లులకు అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు కూడా బలంగా ఉన్నాయన్నారు. ఆయా కారణాల ప్రభావంతో తేలికపాటి వర్షాలకు అవకాశం ఏర్పడిందన్నారు.




