Tuesday, 3 November 2026

పాడి రైతులకు చంద్రబాబు చేతుల మీదుగా బోనస్‌ పంపిణీ

ఒంగోలు నగరం : ప్రజాగర్జన సభలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముందుగా ప్రకాశం పాల డెయిరీలో జరిగిన కార్యక్రమంలో పొల్గొన్నారు. ఈ సందర్భంగా పాల ఉత్పత్తి దారులకు బోనస్‌లు పంపిణీ చేశారు. బెయిరీ ఛైర్మన్‌ శ్రీనివాసపరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ డెయిరీ చరిత్రలో తొలిసారిగా రైతులకు , ఉద్యోగులకు, పాల ఏజెంట్లకు బోనస్‌లను అందజేసినందుకు పాలకవర్గాన్ని అభినందించారు. రైతుల శ్రేయస్సు కోసం తెదేపా పని చేస్తుందని చంద్రబాబు అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం శాయశక్తులా కృషి చేస్తామని, తెదేపా అధికారంలోకి రాగానే రుణమాఫీ దస్త్రంపై మొదటి సంతకం చేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బలరామకృష్ణ మూర్తి, పొటిట్‌ బ్యూరో సభ్యుడు సిద్ధా రాఘవరావు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా తెదేపా అధ్యక్షులు జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *