Friday, 6 November 2026

ఆదిలాబాద్

మంచిర్యాల పట్టణంలో చైన్‌స్నాచింగ్‌

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస టాకిస్‌ రోడ్డులో చైన్‌స్నాచింగ్‌ జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఐదు తులాల బంగారు గొలుసును లాకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు…

ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నాడు:వివేక్‌

ఆదిలాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో విద్యుత్‌ సంక్షోభం వస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడని పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ సభ్యుడు వివేక్‌ మండిపడ్డారు వీహెచ్‌పై తిరుపతిలో జరిగిన దాడిని వివేక్‌ తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్‌లో తెలంగాణ…

మంచిర్యాలలో శ్రీశ్రీనగర్‌లో దారుణం

ఆదిలాలాబాద్‌ : జిల్లాలోని మంచిర్యాల పట్టణం శ్రీశ్రీనగర్‌లో దారుణం సంఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు తల్లి, కొడుకులను హత్య చేశారు. మృతులు దేవీ దుర్గమ్మ దినసరి కూలీ కాగా, ఆమె కొడుకు రాజేందర్‌ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నారు.…

గోదావరి పాయలో చిక్కుకున్న పశువుల కాపర్లు

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా లక్ష్మణ్‌ చాంద్‌ మండలంలో పారిపల్లి, మునపల్లి వద్ద నిన్న మధ్యహ్నం గోదావరి పాయలో ఏడుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ 16 గేట్లు ఎత్తడంతో వరద ఉద్ధ్రృతి కారణంగా పశువుల కాపర్లుతో పాటుల 400…

ఆదిలాబాద్‌లో రెండు పంచాయతీలకు ఎన్నికలు వాయిదా

కాగజ్‌నగర్‌ : ఆదిలాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలంలోని కుష్ణపల్లి, పాపన్నపేటలో మంగళవారం జరగాల్సిన పంచాయితీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.పాపన్నపేటలో మంగళవారం జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. భారీ పర్షాలకు వాగులు ఉప్పోంగి ఓటర్లు రాలేని పరిస్థితి నెలకొనడంతో…

వాయిదా పంచాయితీల్లో పోలింగ్‌ ప్రారంభం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని సిర్పూర్‌(యూ) మండలం పంగిడి, భీమిని మండలం లక్ష్మీపూర్‌ పంచాయతీల్లో ఉదయం పోలింగ్‌ ప్రారంభం అయింది. వరదల కారణంగా ఈ పంచాయతీల్లో పోలింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

రాజీవ్‌గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన కాంగ్రెస్‌

కాగజ్‌నగర్‌ పట్టణం: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణాధ్యక్షుడు వెంకటరమణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక తెలంగాణ ప్రకటించగా సీమాంధ్రులు అడ్డుకునేందుకు కృత్రిమ ఉద్యమం చేపడుతున్నట్టు ఆరోపించారు. ఈ సందర్భంగా…

వర్షం కారణం వల్ల కుప్పకూలిన పాఠశాల భవనం

బేల: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల భవనం మంగళవారం అర్థరాత్రి వర్షం కారణంగా కుప్పకూలింది. రాత్రిపూట కావడంతో ఎలాంటి హానీ జరగలేదు. భవనం కూలిపోవడంతో విద్యార్థులకు ఉపాధ్యాయులు బుధవారం ఆరుబయటే తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం…

గ్రంథాలయాధికారి కార్యాలయం సీజ్‌ చేసిన జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని శాఖ గ్రంథాలయాధికారి కార్యాలయాన్ని సోమవారం ఉదయం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌ సీజ్‌ చేశారు. గ్రంథాలయాధికారి గత కొద్ది రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నట్లు పాఠకులు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా కార్యదర్శి తనిఖీ చేశారు. విధులకు…

బల్లిపడిన సాంబారు తిని అస్వస్థత గురైన కార్మికులు

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు క్యాంటిన్‌లో తయారు చేసిన సాంబారులో సోమవారం ఉదయం బల్లి పడింది. దీంతో క్యాంటిన్‌లో సాంబారు తిన్న పలువురు కార్మికులు వాంతులు చేసుకోగా చికిత్స నిమిత్తం ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. కార్మికులకు…