Saturday, 7 November 2026

కరీంనగర్

గోదాముల నిర్మాణానికి 8.31ఎకరాల భూమి

జమ్మికుంట: 20వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేయగల సామర్థ్యం ఉన్న గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చినట్లు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సమ్మిరెడ్డి తెలిపారు. దీనికోసం 8.31ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించిందని అన్నారు.

మండలస్థాయి క్రీడాలు ప్రారంభం

జమ్మికుంట: మండలస్థాయి పాఠశాల క్రీడోత్సవాలు ఈ రోజు జమ్మికుంటలో ప్రారంభమైనావి. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సమ్మిరెడ్డి వీటిని ప్రారంభించారు.

ఏ ముల్క్‌కా నూర్‌ హై !

ముల్కనూరు స్త్రీ శక్తి దేశానికే ఆదర్శం సహకారానికే కొత్త భాష్యం చెప్పిన ముల్కనూరు సహకార సంస్థలు గవర్నర్‌ నరసింహ్మ భీమదేవరపల్లి(కరీంనగర్‌ జిల్లా), సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి): ముల్కనూర్‌లోని సంస్థలు సహకారానికే కొత్త బాష నేర్పాయాని, ముల్కనూర్‌లోని స్త్రీశక్తి దేశానికి…

నీటి తోట్టీలో పడి బాలుడి మృతి

హుస్నాబాద్‌ మండలంలోని గౌరవెల్లి గ్రామంలో దాసరి యశ్వంత్‌ అనే రెండు సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు నీటి తోట్టిలో పడి మృతి చెందారు. బాలుని తల్లి బట్టలు ఉతుకుతుండగా యశ్వంత్‌ అడుకుంటూ వళ్లి తోట్టిలో పడినట్లుతెలిపారు

రేపు కరీంనగర్‌ జిల్లాలో గవర్నర్‌ పర్యటన

కరీంనగర్‌: రేపు జిల్లాలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ పర్యటించనున్నారు. హుజురాబాద్‌, ముల్కనూర్‌, కరీంనగర్‌లలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. పోలీసులు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పట్లు చేశారు. గవర్నర్‌ పర్యటనను అడ్డుకుంటారనే  కారణంతో విద్యార్థులను, టీఆర్‌ఎస్‌, జేఏసీ,…

రామడుగులో మలేరియాతో మహిళ మృతి

కరీంనగర్‌: రామడుగు మండల కేంద్రంలోని అమరగొండ ఉమ(45) మలేరియా జ్వరం సోకి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఉమకు కరీంనగర్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించిన ఆరోగ్యం కుదుట పడలేదు. వైద్యులు…

ఎమ్మార్పీఎన్‌ అధ్వర్యంలో వికలాంగుల రాస్తారోకో

గోదావరిఖని: వికలాంగులకు పింఛన్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ గోదావరిఖనిరాజీవ్‌ రహదారిపై వికలాంగుల హక్కుల పోరాటసమితి ఎమ్మార్పీఎన్‌ల అధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై భైఠాయించి నిరాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ట్రాఫిక్‌ పోలిసులు అక్కడికి చేరుకుని…

ముల్కనూర్‌లో విషజ్వరంతో మహిళ మృతి

కరీంనగర్‌: చిగురుమామిడి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన మర్రిపల్లి లక్ష్మీ అనే మహిళ రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందినది.

రెండు బైక్‌లు ఢీ- ఇద్దరు వ్యక్తులు మృతి

కోహెడ: మండలంలోని సిద్దిపేట-హుస్నాబాద్‌ ప్రధాన రహదారి సముద్రాల, ఇందిరానగర్‌ స్పీడ్‌బ్రూకర్‌ వద్ద మోపెడ్‌, మోటర్‌సైకిల్‌ను ఢీకొనడంతో ఎక్కల వేణు( 25), తాడిపత్రి శ్రావణ్‌ (34)లుతీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింస్తుండగా మార్గ మధ్యంలో చని పోయారు.…

కరీంనగర్‌ కవాతుకు విసృతి ఏర్పాట్లు

కరీంనగర్‌: కరీంనగర్‌ కవాతుకు విసృతి ఏర్పాట్లు జరుగుతున్నాయని పిట్టల రవీందర్‌ తెలిపారు. అన్ని మండలాలల్లో మంచి స్పందనుందని, సుమారు 20వేల మంది మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళ హరతులు, తెలంగాణ తల్లి , వేయ్యి మంది మహిళలు తెలంగాణ…