Saturday, 7 November 2026

కరీంనగర్

బీజేపీ ఆందోళన

సుల్తానాబాద్‌: ఢిల్లీలో  బీజేపీ కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ సుల్తానబాద్‌లో బుధవారం ఆ పార్టీ కార్యకర్తలు రాజీవ్‌ రహదారిపై ఆందోళన చేపట్టారు.

పెద్దపల్లి సుందరీకరణ చేయటానికి నిర్ణయాలు

పెద్దపల్లి: పెద్దపలిలోని నగర పంచాయితి అధికారులు విజన్‌ డాక్యుమెంట్‌ను రూపోందించారు. స్థానిక రైల్వే స్టేషన్‌నుంచి బస్టాండ్‌ వరకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు, కూడళ్ల అభివృద్ది చేయడానికి అధికారులు నిర్ణయించారు.

పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మానం

పెద్దపల్లి: పెద్దపలి లోని ప్రైవేట్‌ పాఠశాలల్లోని విద్యార్థులు ఉపాధ్యాయులను సర్మానించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి లోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు.

గేదెల కోసం చెరువులో దిగి మృత్యువాత పడిన రైతు

కమాలాపూర్‌: మాట్ల పోచయ్య(55) మంగళవారం సాయంత్రం తన గేదెలను నీళ్లకోసం గ్రామ శివారులోని ఎర్రకుంట చెరువుకు తీసుకెళ్లాడు. గేదెలను బయటకు తీసుకురావటానికి పోచయ్య చెరువులో దిగి ముళ్లపోదల్లో ఇరుక్కు పోయి మృత్యువాత పడ్డాడు. రాత్రి కూడా రైతు ఇంటికి…

ఆర్థిక ఇబ్బందులతో మృతి

కమాలాపూర్‌: మండలంలోని మౌటం పోచాలు(40) అనే చిరు వ్యాపారి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక బుధవారం ఉదయం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లీ ఆరోగ్యం బాగు చేయించేందుకు కుటుంబ అవసరాలకోసం రూ.50వేలు అప్పు చేశాడు. అప్పు తీర్చలేక కలత…

వైద్యం చేయించుకునే స్థోమతలేక నేత కార్మికుని మృతి

కరీంనగర్‌: సిరిసిల్లలో స్థానిక సుందరయ్యనగర్‌కు చెందిన నేత కార్మికుడు రాజమౌలి అప్పుల బాధ భరించలేక కిడ్ని అమ్ముకున్నాడు. తద్వారా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాడు. అయితే కొన్ని రోజుల అనంతరం అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య చికిత్సలు చేయించుకునే ఆర్థిక…

మైసమ్మ విగ్రహం ధ్వంసం

కరీంనగర్‌:ఎల్లారెడ్డిపేటలోని కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో ఆటో యజమానుల సంఘం ప్రతిష్టించిన మైసమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధంవంసం చేశారు. విగ్రహాన్ని పెకిలించి పడేశారు. యజమానుల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

విద్యుత్‌ అధికారులకు వినతి పత్రం సమర్పించిన రైతులు

కరీంనగర్‌: గంగాధర మండలంలోని 4గ్రామాల్లో రెండు నెలల క్రింద కాలిపోయిన విద్యుత్‌ ట్రాన్స్‌ పార్మర్లకు మరమత్తులు చేపట్టాలని రైతులు గంగాధర విద్యుత్‌ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. నాగిరెడ్డిపూర్‌, నర్శింహులపల్లి, మల్లాపూర్‌, ఉప్పరమల్యాల గ్రామంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి…

ధర్మపురి ఆలయంలో ప్రత్యేక పూజలు

కరీంనగర్‌: ధర్మపురిలో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో సంకష్టహర చతుర్ధి సందర్భంగా ఈశాన్య గణపతికి విశేశ పూజలు నిర్వహించారు. వేద పండితులు స్వామి వారికి అభిషేకాలు చేశారు.