Saturday, 7 November 2026

కరీంనగర్

వైకల్య విజేతకు 32వేల సాయం అందించిన ‘జనంసాక్షి’ పాఠకులు

జగిత్యాల: వైకల్య విజేతను ప్రోత్సహిద్దామంటూ ‘జనంసాక్షి’లో పక్షం రోజులపాటు వరుసగా ప్రచురించిన కథనానికి విశేషస్పంధన లభించింది. ఈ వైకల్య విజేతకు దాతలనుంచి 32,000 వేల సాయం అందింది. ఈ మొత్తన్ని డా|| విజయేందర్‌ రెడ్డి చేతులమీదుగా అందించారు. జగిత్యాల…

జీపు-బొలెరొ వ్యాన్‌ ఢీ నలుగురికి తీవ్ర గాయాలు-ఆసుపత్రికి తరలింపు

కరీంనగర్‌: మల్యాల శివారులో అడ్డరోడ్డుపై రామన్నపేటకు చెందిన కూలిలను తీసుకెళ్తున్న జీపు-బొలెరొ వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ఘటనలో జీపు డ్రైవర్‌తో సహ ఇద్దరు మహిళలు, ఒక వృద్దుడు తీవ్రంగా గాయాపడ్డారు. వీరిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.

దారితప్పి గ్రామంలోకి వచ్చిన నెమలిని అడవిలో వదిలేసిన అధికారులు

కరీంనగర్‌: రామగండం మండలం జయ్యారం గ్రామంలోకి దారితప్పి వచ్చిన నెమలిని గ్రామస్థులు ఆడవిలో వదిలేశారు. శుక్రవారం రాత్రి గ్రామంలోకి వచ్చిన నెమలిని స్థానికులు పట్టుకుని గ్రామంలోని ఒక ఇంట్లో ఉంచారు. అటవిశాఖ అధికారులకు సమాచారం అందించిన అనంతరం ఉదయం…

సిరిసిల్లలో నేతన్నల’ మనో ధైర్యర్యాలి’

కరీంనగర్‌: సిరిసిల్లలో నేతన్నల ఆధ్వర్యంలో ‘ మనో ధైర్యర్యాలి’ నిర్వహించారు. ఇవాళ జరిగిన ఈ ర్యాలీకి స్థానికు ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నేత కే తారక రామారావు, కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఆర్థిక ఇబ్బందుల్లో…

తెలంగాణ అన్నప్పుడే వేరే ఉద్యమాలు: నారాయణ

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పుడే వేరే ఉద్యమాలు వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రాయలసీమ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎప్పుడూ లేవని ఆయన తెలియజేశారు. కాగా, సెప్టెంబర్‌ 30న నిర్వహించే’ హైదరాబాద్‌ మార్చ్‌’కు తాము సంపూర్ణంగా మద్దతునిస్తామని…

అతిసారంతో వ్యక్తి మృతి

కరీంనగర్‌: ఎలిగేడు మండలంలో అతిసారం ప్రబలుతోంది. మండలంలోని దూలికట్టలో అతిసారంతో శనివారం ఉదయం ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో పది మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కూర్చుంటే కుదరదు.. తెగించి కొట్లాడితేనే తెలంగాణ

అందుకే పోరుయాత్ర : నారాయణ కరీంనగర్‌ టౌన్‌, అగస్టు31(జనంసాక్షి): కూచుంటే కుదరదని తెగించి కొట్లాడితేనే తెలంగాణ సాధ్యమని, అందుకే పోరుయాత్ర చేపట్టినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అన్నారు. తెలంగాణ సాధనకై సీపీఐ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం…

భారీ వర్షాలకు బోయిన్‌పల్లి మండలంలో నీటమునిగిన పత్తిపంట

కరీంనగర్‌: బోయిన్‌పల్లి మండలంలోని దుండ్రుపల్లి, కోరెం, తడగొండ, బోయిన్‌పల్లి గ్రామాల్లో శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పత్తిపంట నీటమునిగింది. దుండ్రపల్లి కోరెం వెళ్లె రహదారిలో కొండపోచమ్మ వరద ఎద్ధృతికి రహదారి కోతకు గరైంది. తడగొండ గ్రామంలో నీట…

సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించిన రెవెన్యూ అధికారులు

కరీంనగర్‌: ధర్మపూరి మండలంలోని నేరెళ్ల గ్రామంలో ఈ రోజు రెవెన్యూ అధికారులు సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించారు. జగిత్యాల ఆర్డీవో హనుమంతరావు మాట్లాడుతూ అంటరాని తనం నేరమన్నారు. దీన్ని నిర్మూలించటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ధర్మపురి…

బోయిన్‌పల్లి ఎస్‌గా బాధ్యతలను స్వీకరించిన కరుణాకర్‌

కరీంనగర్‌: బోయిన్‌పల్లి ఎస్‌ఐగా కరుణాకర్‌ ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ శ్రీలతను వీఆర్‌కు బదిలీ చేస్తూ కరీంనగర్‌పీటీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కరుణాకర్‌ను ఇక్కడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.