Sunday, 15 November 2026

నల్లగొండ

రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

మొదటి రౌండ్‌లో లీడ్‌లో పల్లా నల్లగొండ,మార్చి26   (జ‌నంసాక్షి) :  ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.  ఈ కౌంటింగ్‌ లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో…

ఎవరికీ రాని స్పష్టమైన మెజార్టీ

నల్లగొండ:  నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజేతగా నిలవాలంటే 66,777…

ఎసిబి వలలో విద్యుత్‌ ఎఇ

నల్లగొండ,మార్చి 25(జ‌నంసాక్షి):  జిల్లాలోని నార్కట్‌పల్లి విద్యుత్‌ శాఖ ఏఈ అబ్జల్‌ బాబా ఏసీబీకి దొరికిపోయాడు. రైతు కందాల పాపిరెడ్డి నుంచి రూ. 18 వేలు లంచం తీసుకుంటుండగా బాబాను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాబా నివాసంలో ఏసీబీ అధికారులు…

సాయంత్రానికి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ తొలిరౌండ్‌ ఫలితం

నల్లగొండ, మార్చి 25: నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ తొలి రౌండ్‌ ఫలితం సాయంత్రం ఆరు గంటలకు వెల్లడించే అవకాశం ఉంటుందని కౌంటింగ్‌-రిటర్నింగ్‌ అధికారి సత్యనారాయణరెడ్డి తెలిపారు. రాత్రంతా కౌంటింగ్‌ జరుగుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా యూటీఎఫ్‌-సీపీఎమ్‌…

ట్రాక్టర్‌ బోల్తా.. మహిళ మృతి

నల్లగొండ, మార్చి 24: జిల్లాలోని బీబీనగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. ఓ ప్రైవేటు వెంచర్‌లో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకొని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మూడు జిల్లాల్లో ఎన్నికల సరళి పరిశీలన

నల్గొండ, మార్చి 22 : ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని కలెక్టర్‌ పర్యవేక్షించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్న తీరును, వెబ్‌కాస్టింగ్‌ను కలెక్టర్‌ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు.

సాయం చేయబోతే.. ప్రాణాలు పోయాయి!

మునగాల: నల్లగొండ జిల్లా మునగాల మండలం కలకోవ గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు చెట్టు మీద పడడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కలకోవ గ్రామానికి చెందిన గన్నా వెంకటేశ్వరరావు తన ఇంటి…

నిప్పులా బయటపడతా : జగదీశ్‌రెడ్డి

నల్లగొండ, మార్చి 20 : తనపై వచ్చిన ఆరోపణల నుంచి నిప్పులా బయటపడతానని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే తనపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంజినీరింగ్‌ కాలేజీలపై కఠినంగా వ్యవహరించిన తనకు డబ్బులు ఎలా…

కుటుంబసభ్యులపై దాడి..30వేలు అపహరణ

నల్లగొండ: జిల్లాలోని నడిగూడెం మండలం గోపాలపురంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. కొందరు దుండగులు ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులపై దాడి చేసి రూ.30 వేలు అపహరించుకునిపోయారు.