Sunday, 15 November 2026

నల్లగొండ

ఇంటర్‌ పరీక్షల్లో మాన్‌ కాపీయింగ్‌

నల్గొండ: ఇంటర్‌ పరీక్షల్లో మాన్‌కాపీయింగ్‌ జోరుగా సాగుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వైష్ణవి జూనియర్‌ కళాశాల అధ్యాపకులు ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలకు సమాధానాలు రాసి విద్వాన్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్నారు. పరీక్షా కేంద్రంలో ఈటీవీ కెమెరాలను చూడగానే…

నకిరేకల్‌లో వస్త్రవ్యాపారుల నిరసన

నకిరేకల్‌: వస్త్రాలపై వ్యాట్‌ అమలుకు నిరసనగా నకిరేకల్‌ పట్టణంలో మంగళవారం నాలుగో రోజు వస్త్ర దుకాణాల బంద్‌ కొనసాగింది. వ్యాపారులు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణ ప్రధాన కూడలిలోని ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ…

చౌటుప్పల్‌ చేరిన సీపీఐ పాదయాత్ర

చౌటుప్పల్‌: మునుగోడు ఎమ్మెల్యే యాదగిరి రావు ఆధ్వర్యంలో సీపీఐ చేపట్టిన పాదయాత్ర చౌటుప్పల్‌కు చేరింది. నక్కలగంజి ఎత్తిపోతల పథకానికి నిధులుమంజూరు చేయాలని, ఎన్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రకు చౌటుప్పల్‌లో తెదేపా,…

భద్రకాళీ జాతర ప్రారంభం

చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలో వేంచేసియున్న శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి దేవాలయంలో వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, కల్యాణమహోత్సవం, ఉదయం…

స్థానిక ఎన్నికల్లో తెదేపాదే విజయం

చిలుకూరు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ తెదేపా విజయకేతనం ఎగురవేస్తుందని కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు అన్నారు. శనివారం చిలుకూరు మండల కేంద్రంలో జరిగిన మండల తెదేపా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

స్పిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

భువనగిరి: బీబీనగర్‌ మండలం కొలమడుగు గ్రామంలోని విజయలక్ష్మీ స్పిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పత్తి బేళ్లు తగులబడుతున్నాయి. భువనగిరి, చౌటుప్పల్‌, హైదరాబాద్‌ మౌలాలీ నుంచి అగ్నిమాపక శకటాలు బయలు దేరాయి. భారీఎత్తున నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

బీబీనగర్‌ మండలం కొండమడుగు జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

నల్గొండ: బీబీనగర్‌ మండలం కొండమడుగు జిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పత్తిబేళ్లు కాలిబూడిదయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో నష్టం భారీగా అంచనా వేస్తున్నారు.

చెట్టును ఢీకొన్న స్కార్పియో, నలుగురు మృతి

కట్టంగూర్‌: నల్గొండ జిల్లా విజయవాడ-హైదరాబాదు రహదారిపై కట్టంగూరు శివారులో కాకినాడ వెళ్తున్న స్కార్పియో వాహనం అతి వేగంతో వచ్చి రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనంలోని ముగ్గురు మహిళలతో సహా నలుగురు అక్కడికక్కడే మృతి…

ఎల్‌ ఐసీ ఏజెంట్ల ధర్నా

భువనగిరి: బీమా బిల్లు 2008ని నిరసిస్తూ భువనగిరి ఎల్‌ ఐసీ కార్యాలయం ముందు గురువారం ఎల్‌ ఐసీ ఏజెంట్ల ధర్నా నిర్వహించారు. ఈ సంర్భంగా వారు పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెట్టరాదని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు…

ఘనంగా మాధవరెడ్డి 13వ వర్ధంతి

భువనగిరి: దివంగత మాజీ హోంశాఖ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి 13 వర్ధంతిని భువనగిరిలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన సతీమణి ఉమామాధవరెడ్డి భువనగిరిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వడపర్తి గ్రామంలోని ఘాట్‌వద్ద నివాళులు…