Thursday, 5 November 2026

మెదక్

అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం సాయంత్రం

సంగారెడ్డి : ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సంగారెడ్డి కోర్టులో బుధవారం వాదనలు పూర్తియ్యాయి. అక్బర్‌ తరపు న్యాయవాది రఘు నందన్‌ తన వాదనలను న్యాయమూర్తి మారుతీదేవి ఎదుట విన్పించారు. న్యాయమూర్తి తీర్పును సాయంత్రానికి వాయిదా వేశారు.

అక్బరుద్దీన్‌ బెయిల్‌పై వాదనలు పూర్తి

సంగారెడ్డి: కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌  బెయిల్‌ షిటిషన్‌పై సంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నిర్ణయాన్ని కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇదే కేసులో అక్బర్‌ సోదరుడు అసదుద్దీన్‌ అరెస్టయి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.

దూషణల వల్ల తెలంగాణ రాదు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి

సంగారెడ్డి, జనవరి 28 (): తెలంగాణ రాష్ట్ర విభజన తెలంగాణ రాష్ట్రసమితికి ఇష్టం లేదని స్థానిక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ మాట్లాడుతూ, ప్రజలకు ఉన్న మనోభావాలు, ఆకాంక్షను రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకే గత…

అక్బరుద్దీన్‌ కేసు 8కి వాయిదా

సంగారెడ్డి, జనవరి 28 (): 2005 సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను దూషించిన కేసులో అక్బరుద్దీన్‌ కేసు విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేస్తూ పస్ట్‌క్లాస్‌ మ్యాజిస్ట్రేట్‌ మారుతిదేవి  వాయిదా వేసినట్టు అక్బరుద్దీన్‌ న్యాయవాది రఘునందన్‌…

మదర్‌ అండ్‌ చైల్డ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ పేర్లు నమోదు చేసుకోవాలి

మెదక్‌, జనవరి 28 (): మదర్‌ అండ్‌ చైల్డ్‌ ట్రాకింగ్‌ సిస్టంలో గర్భవతులు,పిల్లల పేర్లను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ. దినకర్‌బాబు వైద్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయం నుండి వైద్య శాఖ సిబ్బందితో…

బోదకాలు నివారణపై ప్రజలను చైతన్యనం చేయాలి

మెదక్‌, జనవరి 28 (): బోదకాలు నివారణపై ప్రజలను చైతన్యవంతులను చేసే ర్యాలీని జిల్లా కలెక్టర్‌ ఎ. దినకర్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. సోమవారం రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం నుండి ఐ.టి.ఐ. వరకు నిర్వహించిన ర్యాలీని…

పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికలు

మెదక్‌, జనవరి 28 (): పట్టభద్రులు, ఉపాధ్యాయులు  నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే మంజూరీ, పంపిణీ చేయకూడదని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌…

సంగారెడ్డి కోర్టులో అక్బరుద్దీన్‌ను హాజరుపరిచిన పోలీసులు

సంగారెడ్డి : కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను పోలీసులు సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. ఇందు కోసం ఆయన్ను ఈ ఉదయం ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి సంగారెడ్డికి తరలించారు. ఇదే కేసులో హాజరయ్యేందుకు వచ్చిన ఎంపీ…

సంగారెడ్డి కోర్టులో హాజరైన అసదుద్దీన్‌

సంగారెడ్డి : కలెక్టర్‌ దూషించిన కేసులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌తోపాటు నలుగురు పార్టీ ఎమ్మెల్యేలు సంగారెడ్డి న్యాయస్థానంలో ఈ ఉదయం హాజరయ్యారు. ఎంఐఎం నేతల హాజరు అయిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కోర్టు ప్రాంగణంలో పోలీసులు…

అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా సంగారెడ్డి కోర్టులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ తరపున ఆయన న్యాయవాది రఘునందన్‌రావు బెయిల్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. అక్బరుద్దీన్‌ ఆదిలాబాద్‌ జిల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.