Monday, 16 November 2026

Main

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి…

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కడప నుండి వస్తున్న లారీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో భారత్ గార్డెన్ వద్ద ఆగివున్న మరో లారీని ఢీకొంది. అనంతరం ఈ రెండు లారీలు రోడ్డు పక్కన…

ఔటర్ రింగు రోడ్డుపై బెంజ్‌ కారు దగ్ధం

రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ దగ్గర ఓఆర్ఆర్‌పై బెంజ్‌ వాహనం దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించి మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్తుండగా…

కారు, బైక్ ఢీ: ఇద్దరి పరిస్థితి విషమం

మహేశ్వరం(రంగారెడ్డి) :రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ పరిధిలోని శ్రీశైలం హైవేపై కారు, బైక్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా చెట్టుపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన కొడుకును హైదరాబాద్‌లో జరిగే పాలిసెట్…

యాదాద్రిలో గర్భగుడి దర్శనాలు నిలిపివేత

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ సంకల్పించిన మహోన్నత అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి. ఆలయాన్ని తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఇవాళ్టి నుంచి స్వామి వారి గర్భగుడి దర్శనాలు నిలిపివేశారు.…

శంషాబాద్‌లో పోలియో వ్యాక్సిన్ ప్రారంభం

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌లో పోలియో వ్యాక్సిన్‌ను రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐదు నెలల పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. మూడు నెలల్లో 48 పీహెచ్‌సీలు, 12 అర్బన్ హెల్త్ సెంటర్లకు…

కొండాపూర్‌ గేట్‌ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

రంగారెడ్డి: ఘట్‌కేసర్‌ మండలం కొండాపూర్‌ గేట్‌ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లి వ్యాన్ బోల్తా : ఐదుగురి మృతి

పరిగి: పెళ్లి బృందంతో వెళ్తున్న వ్యాన్‌ బోల్తాపడి ఐదుగురు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వికారాబాద్‌ మండలం ద్యాచారం నుంచి షాబాద్‌ మండలం ఉత్తరాస్‌పల్లికి 60మందితో వెళ్తున్నడీసీఎం వ్యాను ప్రమాదవశాత్తూ బోల్తా…

మనస్థాపంతో కుటుంబంతో సహా వ్యక్తి ఆత్మహత్య

రంగారెడ్డి: తాండూరు మండలం జినుగుర్తిలో విషాదం అలముకుంది. రాజు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నిప్పటించుకున్నాడు. తల్లి లక్ష్మి, చెల్లెలు బుజ్జమ్మతో పాటు రాజు మృతి చెందారు. కిరోసిన్‌ పోయగానే తమ్ముడు చింటు తప్పించుకున్నాడు. భార్య తనపై వేధింపుల కేసు…

జిలెటిన్ స్టిక్స్ పేలుడు.. ఒకరి మృతి

రంగారెడ్డి : రాజేంద్రనగర్ మండలం మంచి రేవులలో ఓ స్ర్కాప్ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదంలో జిలెటిన్ స్టిక్స్ పేలాయి. ఈ ప్రమాదంలో మీసాల కుమార్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు…

పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం

   రంగారెడ్డి : జిల్లాలోని పూడూరు సమీపంలోని పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిల్లులో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి ఇంకా అగ్నిమాపక సిబ్బంది చేరుకోలేదు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొగలు దట్టంగా కమ్ముకున్నాయి.