Saturday, 28 November 2026

హైదరాబాద్

పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదు: దానం నాగేందర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదని కార్మిక శాఖ మంత్రి నాగేందర్‌ అన్నారు. బుధవారమిక్కడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో జరుతున్న కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను…

ఇంతటి అవినీతి పాలన ఏ ప్రధాని హయాంలోనూ జరగలేదు

-భాజపా నేత అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ : అవినీతిని అంతమొందిస్తామన్న యూపీఏ మాటలు ఎవరూ పట్టించుకోరని భాజపా నేత అరుణ్‌జైట్లీ అన్నారు. యూపీఏ-2 నాలుగేళ్ల పాలనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ప్రధాని హయాంలోనూ ఇంతటి అవినీతి పాలన జరగలేదని…

ఏం చేశారని సంబరాలు : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ : యూపీఏ-2 నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారని సంబరాలు జరుపుకుంటున్నారని భాజపా నేత సుష్మాస్వరాజ్‌ ప్రశ్నించారు. దేశ ఆర్థిక వాతావరణం ఆందోళనకరంగా ఉందని అన్నారు. ప్రతి నిర్ణయానికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాపైనే ప్రధాని ఆధారపడుతున్నారని విమర్శించారు.

కావలిలో కలకలం సృష్టించిన పసికందు విక్రయం

కావలి, జనంసాక్షి: 20వేల రూపాయలకు పసికందును అమ్మకానికి పెట్టిన నెల్లూరు జిల్లా కావలిలో కలకలం సృష్టించింది. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన మున్నా, దస్తగిరమ్మ దంపతులకు ఇలీవలే మగబిడ్డ జన్మించాడు. బిడ్డను అమ్ముకోవాలనుకున్న ఆ దంపతులు….. చిన్నారికి తల్లి చనిపోయిందని…

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగర బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెంట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 26,250 పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 24,550గా ఉంది. కిలో…

ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన ఇమ్రాన్‌ఖాన్‌

లాహోర్‌ : పాకిస్థాన్‌కి చెందిన మాజీ క్రికెటర్‌, ప్రస్తుత రాజకీయవేత్త ఇమ్రాన్‌ఖాన్‌ ఈరోజు ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. మే 7 న ఎన్నికల ప్రచారంలో ఉండగా జరిగిన ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం…

మరో నెల రోజుల్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం

-మంత్రి జానారెడ్డి హైదరాబాద్‌ : పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలే గ్రామరాజ్యానికి పునాధి అని మంత్రి జానారెడ్డి అన్నారు. రిజర్వేషన్ల ఇబ్బంది వల్లే స్థానికి సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించలేదని ఆయన పేర్కొన్నారు. పార్టీ విస్తృతస్థాయి సదస్సులో జానారెడ్డి…

గెలుపుకోసం ఆరాట పడుతున్న రాజస్థాన్‌, సన్‌ రైజర్స్‌

ఢిల్లీ,జనంసాక్షి: ఐపిఎల్‌లో ప్రవేశించిన మొదటిసారే ప్లే-ఆఫ్స్‌కు చేరుకున్న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఎలిమినేటర్‌ మ్యాఛ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఈ రాత్రికి ఢీకొననుంది. లీగ్‌ స్టేజిలో ఈ రెండు జట్లు చెరొక మ్యాచ్‌ గెలిచి సమవుజ్జీలుగా ఉన్నందున తటస్థ వేదిక…

ఏ పదవికీ పోటీ చేయనని కడియం ప్రకటించాలి : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : తెలంగాణ కోసమే కడియం శ్రీహరి తెదేపాను వీడితే ఏ పదవికీ పోటీ చేయనని ప్రకటించాలని తెదేపా నేత ఎర్రబెల్లి కోరారు. తెలంగాణకు తెదేపా అనుకూలంగా లేఖ ఇచ్చినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైన మాట వాస్తవమేనని తెలిపారు.…

మంత్రి పార్థసారథి కేసు విచారణ వాయిదా

విజయవాడ : మంత్రి పార్థసారథి ఎన్నికల అఫిడవిట్‌ కేసు విచారణ వచ్చే నెల 14కు వాయిదా పడింది. మంత్రి పార్థసారధి ఎన్నికల అఫిడవిట్‌ కేసు విచారణను మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు  వాయిదా వేసింది.