Saturday, 28 November 2026

హైదరాబాద్

నిహారిక ఇండస్ట్రీస్‌ కార్మికుడి ఆత్మహత్య

హైదరాబాద్‌, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో లేబర్‌ కాంట్రాక్టరుగా పనిచేస్తున్న ఈడిగ సుధాకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సుధాకర్‌ గౌడ్‌ పురుగుల మందు తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యాజమాన్యం తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య…

శుభలేఖ ఇవ్వడానికే బాబును కలిశాను : గండ్ర

హైదరాబాద్‌ : ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి తెదేపా అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. తన కుమార్తె వివాహానికి సంబంధించి శుభలేఖను ఇచ్చేందుకు చంద్రబాబును కలిశానని ఇతర రాజకీయ విషయాలేవీ చర్చించలేదని గండ్ర తెలిపారు.

అగ్నిప్రమాదంలో మహిళ సజీవ దహనం

నెల్లూరు, జనంసాక్షి: జిల్లాలోని కొండాపురం మండలం పర్లపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం అయింది. గుడిసెకు నిప్పంటుకుని ఈ ప్రమాదం జరిగింది.

లంచం తీసుకుంటూ పట్టుబడిన ట్రాన్స్‌కో ఏఏవో

కడప జల్లా : కడప జిల్లా బనగానపల్లెలో ట్రాన్స్‌కో ఏఏవో బాలసుబ్రహ్మణ్యం రూ.27 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. సెక్యూరిటీ గార్డుల జీతాల బిల్లులు చేయడానికి గుత్తేదారు నుంచి బాలసుబ్రహ్మణ్యం డబ్బులు డిమాండ్‌…

ఎంపీ సీటు ఇస్తేనే డబ్బూ ఖర్చు పెడతా: ఎంపీ గద్దె రామ్మోహన్‌ రావు

విజయవాడ, జనంసాక్షి: రాజకీయాల్లో డబ్బు ప్రధానమని.. అయితే డబ్బే రాజకీయం కాదని టీడీపీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్‌రావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ తరపున ఎంపీ సీటు ఇస్తే తేను డబ్బు ఖర్చు పెడతానని…

చైనాలో పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో విస్ఫోటనం

బీజింగ్‌ : చైనాలో పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా, 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. 20 మంది గల్లంతయ్యారు. గల్లంతైనవారి అచూకీకోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

స్పాట్‌ ఫిక్సింగ్‌పై సీబీఐ దర్యాప్తు చేయించాలి

మదురైలో ప్రజాప్రయోజన వ్యాజ్యం చెన్నై : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌లో ఒక క్రికెట్‌ అభిమాని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనికి సంబంధించి జూన్‌ 10 లోపు వివరణ…

నల్ల ధనాన్ని అరికడితేనే అభివృద్ధి సాధ్యం : చంద్రబాబు

హైదరాబాద్‌ : నల్ల ధనాన్ని అరికడితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాము ప్రతిపాదించిన నగదు బదిలీని కాంగ్రెస్‌ నకిలీ బదిలీగా మార్చిందని విమర్శించారు. దేశంలో రూ.70 లక్షల…

పీజీ మెడికల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ, విజయవాడ : 2013-14 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ మెడికల్‌ (ఎండీ/ఎంఎస్‌) ప్రవేశాలకు సంబంధించి మార్చి 17న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విజయ వాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌…

ఉషోదయం కాదు… భానుడి ఉగ్రరూపం

ఢిల్లీలో తెల్లవారుతూనే మండుతున్న ఎండలు న్యూఢిల్లీ : ఢిల్లీ నగరం ఈరోజు ఉదయం నిద్ర లేస్తూనే భానుడి ఉగ్రరూపాన్ని చవిచూసింది. సగటు ఉష్ణోగ్రతకాన్నా ఏకంగా నాలుగు డిగ్రీలు ఎక్కువగా 30.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతతో ఇవాళ తెల్లవారింది. గత…