Wednesday, 25 November 2026

హైదరాబాద్

6న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 6న ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. అధిష్ఠానం  నుంచి ముఖ్యమంత్రికి ఈ మేరకు పిలుపు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వన విజ్ఞాన్‌ కేంద్రం నుంచి తప్పిపోయిన ఎలుగుబంట్లు

వరంగల్‌ : హన్మకొండ హంటర్‌ రోడ్డులోని వనవిజ్ఞాన్‌ కేంద్రం నుంచి రెండు ఎలుగుబంట్లు తప్పించుకునిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది. ఎలుగుబంట్లను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

సౌర విద్యుత్‌ కేంద్రాన్ని తరలించాలని ఎమ్మెల్యే రాస్తారోకో

గోదాదరిఖని : కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో ఎన్టీపీసీ సౌర విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులు నిలిపివేయాలని తెరాస ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానికులు రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జనావాసాల మధ్య ఉన్న 62 ఎకరాల స్థలాన్ని…

నీటి పారుదల శాఖ కార్యాలయానికి తాళం వేసి నిరసన

ఆత్మకూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బిల్లులు చెల్లించలేదంటూ నీటి పారుదల శాఖ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. తమ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఖైదీని పరామర్శించిన పాక్‌ హైకమిషన్‌ అధికారులు

చండీగఢ్‌ : తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి చండీగఢ్‌ సీజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాకిస్థాన్‌ ఖైదీ సనావుల్లాను ఆ దేశ హైకమిషన్‌ అధికారులు పరామర్శించారు. నిన్న జమ్మూలోని కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న పాక్‌ ఖైదీపై…

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

పెళ్లకూరు : నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని తాల్వాయిపాడులో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికంగా ఉన్న ఓ ఇటుకల తయారీ కేంద్రంలో రజనీ (35) అనే వ్యక్తి నీటి గుంటలో దిగి విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు…

రేపు కర్ణాటక విధానసభ ఎన్నికలు

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం జరగనుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 223 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ విధుల్లో పాల్గొననున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు లక్షా…

కర్ణాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం

బెంగళూరు , జనంసాక్షి: కర్ణాటక విధానసభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెర పడింది. మే 5న కర్ణాటక విధానసభకు పోలింగ్‌ జరగనుంది. మే 8న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.…

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఈఈ వెంకటరమణ

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: కొల్లాపూర్‌ డిప్యూటీ ఈఈ వెంకటరమణ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. నాగర్‌కర్నూల్‌లో రూ. 13వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వెంకటరమణను పట్టుకున్నారు.

స్థాయీ సంఘాల ఛైర్మన్లతో మండలి ఛైర్మన్‌, స్పీకర్‌ భేటీ

హైదరాబాద్‌ : స్థాయీ సంఘాల ఛైర్మన్లు , ఉన్నతాధికారులతో శాసన మండలి ఛైర్మన్‌ చక్రపాణి, శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. పద్దులపై స్థాయీ సంఘాల సమీక్షకు ఈ సమావేశంలో రోడ్‌ మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు.